Begin typing your search above and press return to search.

మరో సంచలన ఆడియో... ఆ వాయిస్ ఎమ్మెల్యే ఆదిమూలం దేనా?

ఆయనపై ఓ మహిళ పెట్టిన లైంగిక వేదింపుల కేసు తీవ్ర సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 12:20 PM IST
మరో సంచలన ఆడియో... ఆ వాయిస్  ఎమ్మెల్యే ఆదిమూలం దేనా?
X

ఎమ్మెల్యే ఆదిమూలం ఒకప్పుడు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, తిరుపతి జిల్లావారికే సుపరిచయస్థులేమో కానీ... ఇటీవల గత కాలంగా మాత్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రజానికానికీ పరోక్షంగా పరిచయస్తులు కీందే లెక్క!! ఆయనపై ఓ మహిళ పెట్టిన లైంగిక వేదింపుల కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది.

ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారడం.. కోర్టుకి వెళ్లడం తెలిసిందే. అయితే... ఇటీవల హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోంది. ఇందులో భాగంగా బాధిత మహిళ స్వయంగా హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్న అంశాలు అన్నీ అవాస్తవమంటూ.. తన న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేశారు.

ఈ సమయంలో హైకోర్టు సైతం బాధిత మహిళతో మాట్లాడింది. ఈ సందర్భంగా స్పందించిన బాధిత మహిళ... ఆదిమూలంపై నమోదు చేసినది తప్పుడు కేసని, దానిని కొట్టివేయాలని న్యాయమూర్తికి వివరించింది. ఆ వ్యవహారం అలాంటి మలుపు తీసుకున్న నేపథ్యంలో... తాజాగా ఆదిమూలానికి చెందినదిగా చెబుతున్న మరో ఆడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంది అని చెబుతున్న ఓ ఆడియో ఇప్పుడు తాజాగా నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఓ మహిళ కేసులో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన... ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరో మహిళతో ఎమ్మెల్యే ఆదిమూలం అసభ్యంగా మాట్లాడారని చెబుతున్న ఆడియో తెరపైకి వచింది.

తాజాగా లీకైనట్లు చెబుతున్న ఆడియోలో... నువ్వు చాలా అందంగా ఉన్నావు.. పర్సనాలిటీ కూడా బాగుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది కోనేటి ఆదిమూలం ఆడియో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే.. ప్రచారం జరుగుతున్నట్లు ఈ ఆడియో ఆదిమూలం దేనా.. కాదా.. అనేది తెలియాల్సి ఉంది.