Begin typing your search above and press return to search.

జూ.ఎన్టీఆర్ పై బాబు కుట్ర బయటపెట్టిన కొడాలి నాని

జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లా వస్తున్న చంద్రబాబు గుంపునకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

By:  Tupaki Desk   |   7 March 2024 9:21 AM GMT
జూ.ఎన్టీఆర్ పై బాబు కుట్ర బయటపెట్టిన కొడాలి నాని
X

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న దురుదేశ్యంతోనే జూనియర్ ఎన్టీఆర్ ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబుపై నాని సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ ను గెలిపించి సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటేసి టిడిపిని ఆక్రమించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొయ్యి తీసి పాతిపెట్టాలని, అప్పుడే టిడిపి బతికి బట్ట కడుతుందని చెప్పుకొచ్చారు. షాకింగ్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లా వస్తున్న చంద్రబాబు గుంపునకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్వనాశనం చేశాడని, 2009 ఎన్నికలలో తారక్ ని వాడుకుని వదిలేశాడని దుయ్యబట్టారు. అప్పట్లో ప్రమాదం జరిగితే తారక్ ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రముఖిని ఈవీఎంలలో బంధించాలని, రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న జగన్ కు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. మంచి చేస్తేనే ఓటు వేయమని దమ్ముగా, ధైర్యంగా అడుగుతున్న నేత జగన్ అని, అందుకే ఆయనను సీఎం చేసి మరోసారి అత్యున్యత స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు

పేద ప్రజలకు జగన్ ఎంతో మేలు చేస్తున్నారని, 120 సార్లు బటన్ నొక్కి రెండున్నర లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ ఫలాలుగా అందించారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను గెలిపించడం కోసం ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తు నొక్కాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతమంది ఏకమై వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ రెండోసారి ఘన విజయం సాధిస్తుందని. సీఎంగా జగన్ మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారని కాన్ఫిడెంట్ గా చెప్పారు.