Begin typing your search above and press return to search.

ఏపీలో రోడ్లపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... ఏపీలో రోడ్ల విషయంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 7:00 AM GMT
ఏపీలో రోడ్లపై కొడాలి నాని ఆసక్తికర  వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రోజు రోజుకీ రసవత్తరంగా మారుతుంది. ఇందులో భాగంగా "సిద్ధం" అంటూ వైఎస్ జగన్ భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలకు ఇసుకవేస్తే రాలనంతగా జనం తరలి వస్తున్నారు. మరోపక్క "రా కదలిరా" అంటూ చంద్రబాబు సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రధానంగా రోడ్లపైనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు! ఈ క్రమంలో కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో రోడ్ల విషయంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి కష్టమో సుఖమో ఏవైనా రెండు సంక్షేమ పథకాలు ఆపి, రోడ్లు వేసేసి ఉంటే ఆయన గురించి మాట్లాడే మగాడే ఉండేవాడు కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల విషయంలో సీఎం జగన్ మ్యానిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు!

వాస్తవానికి సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు రెండు ఏళ్లు పట్టిందని.. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని కొడాలి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లోనే రోడ్లన్నీ వేసేస్తామని కొడ్దాలి నాని స్పష్టం చేశారు. అనంతరం జనసేన ఏర్పాటు చేస్తున్న "మేము సిద్ధమే" ఫ్లెక్సీలపై సెటైర్లు వేశారు కొడాలి.

ఇందులో భాగంగా... ఒకపక్క వైఎస్ జగన్ 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల నిలబెట్టి "సిద్ధం" అని అంటుంటే... "మేమూ సిద్ధమే" అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్నారని... వైసీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు "సిద్ధమే" అంటే బాగుంటుందంటూ చురకలంటించారు. అభ్యర్థులను నిలబెట్టకుండా దేనికి సిద్ధం అని ప్రశ్నించిన ఆయన... ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మాత్రమే సిద్ధమా అంటూ ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో చంద్రబాబుపైనా సెటైర్లు వేసిన కొడాలి నాని... జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు చెబుతుంటారని.. అదే నిజమైతే పోటీకి రమ్మంటే.. దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ పురందేశ్వరి, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ చెల్లమ్మ ఉండాలని.. వారందరినీ కలుపుకుని జగన్ పై యుద్ధారిని రావడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు!!