Begin typing your search above and press return to search.

ప్రోగ్రాం అందరిదీ..పోలీసులు బలికావాలా..బెంగళూరు దుర‍్ఘటనపై కిరణ్‌బేదీ

ఐపీఎల్‌ ముగిసి దాదాపు ఆరు రోజులు అవుతున్నా.. రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారిగా విజేతగా నిలిచిందన‍్న వార్తను అందరూ మర్చిపోతున్నా

By:  Tupaki Desk   |   7 Jun 2025 7:50 PM IST
ప్రోగ్రాం అందరిదీ..పోలీసులు బలికావాలా..బెంగళూరు దుర‍్ఘటనపై కిరణ్‌బేదీ
X

ఐపీఎల్‌ ముగిసి దాదాపు ఆరు రోజులు అవుతున్నా.. రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారిగా విజేతగా నిలిచిందన‍్న వార్తను అందరూ మర్చిపోతున్నా... ఆ ఫ్రాంచైజీ సొంత నగరం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తాలూకు ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. ఓవైపు బీసీసీఐ..మరోవైపు కర్ణాటక ప్రభుత్వం.. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా.. సోషల్‌ మీడియా.. ఇలా ఎవరికి వారు స్పందిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ ఫ్రాంచైజీలను దుమ్మెత్తిపోస్తున్నారు. కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) తీరు కూడా వివాదాస్పదం అయింది. అయితే, ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యానిదే బాధ్యత అని అందరికీ తెలిసిపోతుంది. గత బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇంతలోనే బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి.దయానందపై చర్యలు తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. దీనిని భారతదేశ తొలి మహిళా ఐపీఎస్‌, ఫైర్‌ బ్రాండ్‌ ఆఫీసర్‌, మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేదీ తీవ్రంగా స్పందించారు. తన వాదనలోనూ నిజం ఉంది అనిపించేలా అమె మాట్లాడారు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు. కానీ, బుధవారం ఆర్సీబీ విజయోత్సవానికి దాదాపు 3 లక్షల మంది వచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమానికి పోలీసులు, రాజకీయ నాయకులు, అధికారులు నేతృత్వం వహించినప్పుడు.. దుర్ఘటనకు కేవలం ఒక్కరినే బాధ్యులను చేయడం ఏమేరకు సమంజసం అని కిరణ్‌బేదీ నిలదీశారు. శాంతిభద్రతల కేసు ప్రత్యేకమైనది అని పేర్కొంటూ.. దుర్ఘటన జరిగినప్పుడు అది ఎందుకు అనేది చెప్పడానికీ ఒకరు కావాలని కిరణ్‌ బేదీ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అసలు పోలీసు యంత్రాంగం మొత్తం కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు నగర కమిషనర్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు పోలీసుల వాదన కూడా వినాలి కదా..? అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు మొత్తం పోలీసు వ్యవస్థను నిరాశకు గురి చేశాయని కిరణ్‌ బేదీ వ్యాఖ్యానించారు.

ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారులు పోలీసులతో చర్చించాల్సిన అవసరం ఉందన్న కిరణ్‌ బేదీ.. ఏదైనా కార్యక్రమం విజయవంతం అయితే.. అది తమ గొప్పగా చెప్పుకొంటారని.. తప్పు జరిగితే మాత్ర పోలీసులను బలిపశువులను చేస్తుంటారని మండిపడ్డారు. కిరణ్‌ బేదీ వాదనకు మద్దతుగా బెంగళూరు మాజీ కమిషనర్ భాస్కర్ రావు ముందుకొచ్చారు. దయానంద మంచి అధికారి అని.. అలాంటివారిని బదిలీ చేయడం సరికాదని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆర్సీబీ విజయోత్సవం కోసం ముందు రోజు రాత్రంతా ఆయన పర్యవేక్షణ చేశారని.. దీనికి సిద్ధరామయ్య ప్రభుత్వం బదిలీని బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

కాగా, బెంగళూరు దుర్ఘటనపై పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హేమంత్‌ నింబాల్కర్‌, పలువురు కీలక పోలీసు అధికారులను బదిలీ చేశారు. సీఎం సిద్ధు రాజకీయ కార్యదర్శి కె.గోవిందరాజన్‌ను పదవి నుంచే తీసేశారు. ఆర్‌సీబీ మార్కెటింగ్‌ ప్రధాన అధికారి నిఖిల్‌ సోసలె, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ సిబ్బంది సునీల్‌ మాథ్యూ, కిరణ్, సుమంత్‌లను అరెస్ట్‌ చేశారు.

కగా, భారత తొలి మహిళా ఐపీఎస్‌ అయిన కిరణ్ బేదీ.. 1972లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. 1949లో అమృత్‌సర్‌లో పుట్టిన ఈమె రామన్ మెగసెసే అవార్డు విజేత. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ పనిచేశారు.