Begin typing your search above and press return to search.

ఐ.ఆర్.ఆర్., ఇసుక స్కాం కేసుల్లో కీలక అప్ డేట్

ఇదే సమయంలో... కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై ఎలాంటీ చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:23 AM GMT
ఐ.ఆర్.ఆర్., ఇసుక స్కాం కేసుల్లో  కీలక అప్  డేట్
X

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పై పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇందులో భాగంగా... విచారణను కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. ఇదే సమయంలో... కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై ఎలాంటీ చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

అవును... ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇదే క్రమంలో ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ లో సైతం హైకోర్టు వాయిదా వేసింది. ఇందులో భాగంగా విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుకు ఈ నెల 20న ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇదే క్రమంలో తాజాగా తమ పిటిషన్‌ ను త్వరగా విచారించాలని సీజేఐని లేఖ ద్వారా ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.

మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెలాఖరులోగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తీర్పు అనంతరం ఈ కేసు సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేయబడింది. ఇక అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఇప్పటికే ముందస్తు బెయిల్ రాగా... ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది.