అమరావతిలో ఆ వాలీ పర్మనెంట్ అట ...!
అమరావతి మీద వైసీపీ నేతల స్టాండ్ ఏమిటో తెలియదు కానీ వారు చేసే కామెంట్స్ మాత్రం ఒక రేంజిలో ఉంటున్నాయి.
By: Tupaki Desk | 25 July 2025 10:40 AM ISTఅమరావతి మీద వైసీపీ నేతల స్టాండ్ ఏమిటో తెలియదు కానీ వారు చేసే కామెంట్స్ మాత్రం ఒక రేంజిలో ఉంటున్నాయి. అమరావతి అంటే బాబు గారి డ్రీం ప్రాజెక్ట్ గానే చూస్తున్నారులా ఉంది. కానీ అయిదు కోట్ల మంది ఆశాకిరణంగా ఆలోచనలు చేస్తే బాగుంటుంది అంటున్నారు.
కానీ వైసీపీ నేతలు మాత్రం అమరావతి రాజధాని మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అందులో లేటెస్ట్ గా ఒకటి ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే అమరావతి మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
అమరావతిలో క్వాంటం వాలీ అని ఈ వ్యాలీ ఆ వ్యాలీ అని చంద్రబాబు అంటున్నారు కానీ నిజానికి ఈ వ్యాలీలేవీ అక్కడ నిలబడవు. అక్కడ ఒక్కటే వ్యాలీ పర్మమెంట్ అని ఆయన అంటున్నారు. వ్యాలీ ఏమిటి అంటే ఫిషరీస్ వ్యాలీ అని చెబుతున్నారు. అక్కడ అక్వా పరిశ్రమ అయితే ఫుల్ గా డెవలప్మెంట్ అవుతుంది తప్ప మరేమీ అవదు అనేశారు కేతిరెడ్డి
మరి ఆయన మాటల వెనక అర్ధాలు పరమార్ధాలు చూస్తే కనుక చాలానే దట్టించారు అని అర్థం చేసుకోవాల్సిందే. ఎలా అంటే అమరావతి ప్రాంతమంతా నదీ పరీవాహక ప్రాంతమని అంటారు కొండవీటి వాగు సహా చాలా వాగులు ఉన్నాయి. వానలు వస్తే కూడా వరదలు వచ్చి ఇబ్బంది పెడతాయి అని చెబుతారు.
దాంతో పాటు కొన్ని అడుగులల్లోనే నీరు తగులుతుంది అని అంటారు. దాంతో అమరావతిలో బాబు మార్క్ అకాశ భవనాల నిర్మాణాలు ఎన్ని చేసినా లేక ఎన్ని కార్పోరేట్ సంస్థలను తెచ్చినా అక్కడ ఉండేందుకు సరైన భౌతికపరమైన సదుపాయాలు ఉండవన్నదే వారి ఆలోచనగా ఉందని అంటున్నారు.
అంటే ప్రకృతి పరమైన ఇబ్బందుల వల్ల ఇతరత్రా డెవలప్మెంట్ ఎంత చేసినా అమరావతి విషయంలో అది ప్రతికూలం అవుతుంది అన్న భావాలు అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అందుకే కేతిరెడ్డి లాంటి వారు ఆక్వా కల్చర్ కి అది సూటబుల్ అంటున్నారు. అంటే నిండా నీళ్ళు ఉంటాయి కాబటి చెబుతున్నారు.
చిన్న చేపలను తీసుకుని వచ్చి అక్కడ చేపల పెంపకం పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. క్వాంటం వాలీ అంటున్నారు కానీ ఏ వ్యాలీ ఉండదని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అమరావతి అని చంద్రబాబు ఏమి చెప్పినా ఉండేది ఫిషరీస్ వ్యాలీ మాత్రమే ఉంటుంది. అమరావతిలో ఆక్వావాలీ అని చెబుతున్నారు.
ఇక చంద్రబాబు మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రతీదీ తానే కనిపెట్టాను అంటారు. సైబరాబాద్ ని నేనే అంటారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటారు అలా ఆయన ఎన్నో చెబుతారు కానీ అమరావతిలో జరిగేది ఏమీ ఉండదు, ఆయన ఏమి చేసినా పురోగతి ఉండదని ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మరి దీని మీద టీడీపీ కూటమి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.
