Begin typing your search above and press return to search.

సంచలన విషయాలు వెల్లడించిన కేశినేని శ్వేత... తెరపైకి లోకేష్ ఖాతా?

విజ‌య‌వాడ ఎంపీ, కేశినేని నాని కుమార్తె, 11వ వార్డు కార్పొరేట‌ర్ కేశినేని శ్వేత‌.. తాజాగా త‌న కార్పొరేట‌ర్ ప‌దవికి రాజీనామా చేశారు

By:  Tupaki Desk   |   8 Jan 2024 12:11 PM GMT
సంచలన విషయాలు వెల్లడించిన కేశినేని శ్వేత... తెరపైకి లోకేష్ ఖాతా?
X

విజ‌య‌వాడ ఎంపీ, కేశినేని నాని కుమార్తె, 11వ వార్డు కార్పొరేట‌ర్ కేశినేని శ్వేత‌.. తాజాగా త‌న కార్పొరేట‌ర్ ప‌దవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఆమోదం అనంతరం పార్టీకి కూడా రాజీనామా చేయ‌నున్నట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారితో పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు! దీంతో కేశినేని శ్వేత రాజీనామా లోకేష్ ఖాతాలోనేనా అనే చర్చ బెజవాడ రాజకీయాల్లో మొదలైంది.

అవును... ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో కేశినేని నాని & కో పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతకొంతకాలంగా టీడీపీకి అంటీముట్టనట్లు కనిపిస్తున్న కేశినేని నానీకి ఈ దఫా టీడీపీ లోక్ సభ టిక్కెట్ రాదనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో కేశినేని చిన్నిని దింపే విషయంలో లోకేష్ & కో ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలతో హర్ట్ అయిన శ్వేత రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా... పవర్ కోసం, పదవుల కోసం, డబ్బు కోసం తాము రాజకీయాల్లోకి రాలేదని.. విజయవాడ ప్రజలకోసం, గౌరవం కోసం వచ్చామని అన్నారు. ఇదే సమయంలో ఎంపీగా రెండుసార్లు గెలిచిన ప్రజల మనిషి అయిన త‌న తండ్రిని తీవ్రంగా అవ‌మానించార‌ని వ్యాఖ్యానించారు. అందుకు గల కారణాలను కూడా ఆమె స్పష్టంగా ప్రజల ముందు ఉంచారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

ఇందులో భాగంగా... తిరువూరులో జరిగిన పార్టీకార్యక్రమంలో కేశినేని నానిని ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని అడిగిన రోజే అది పెద్ద అవమానంగా భావించామని ఆమె అన్నారు. మా లోక్ సభ నియోజకవర్గంలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీని "ఎందుకు వచ్చారు" అని అడిగే హక్కు ఎవరికి ఉందని ఆమె సూటిగా ప్రశ్నించారు. అధ్యక్షుడు అక్కడికి వచ్చినప్పుడు సిట్టింగ్ ఎంపీకి ఎందుకు సమాచారం లేదని ఆమె అడిగారు.

ఇదే సమయంలో తన నాయకుడు కేశినేని నాని, కేడర్ తో కలిసి కూర్చుని భవిష్యత్ కార్యచరణ గురించి ఆలోచిస్తామని శ్వేత తెలిపారు. అదేవిధంగా... విజయవాడలో రాబోయే ఎన్నికల్లో కేశినేని నానీనే ఎంపీగా పోటీచేస్తారని.. గెలిచి మూడోసారి లోక్ సభలో అడుగుపెడతారని శ్వేత సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో బెజవాడ రాజకీయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

నాని వర్సెస్ చిన్ని వ్యవహారంపై హాట్ కామెంట్స్:

ఈ సందర్భంగా కేశినేని నాని - కేశినేని చిన్ని వ్యవహారాన్ని ఎలా చూస్తారనే విషయంపై స్పందించిన శ్వేత... కొంతమంది గురించి మాట్లాడి తన స్థాయిని తాను తగ్గించుకోలేనని అన్నారు. కొంతమందికి మోరల్స్ అనేవి ఉండవని అన్నారు. తన చిన్ననాడే కేశినేని చిన్న తన ఫ్యామిలీ మేంబర్ కాదని తాను భావించినట్లు శ్వేత కుండబద్దలు కొట్టారు. అలాంటివారి గురించి మాట్లాడి తన టైం వేస్ట్ చేసుకోనని స్పష్టం చేశారు.