Begin typing your search above and press return to search.

బాబు...జగన్ ల గురించి కేశినేని సంచలన కామెంట్స్...!

ఒక విధంగా స్ట్రైట్ గా వెళ్లే నేత కేశినేని నాని అని చెప్పుకుంటారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 10:50 PM IST
బాబు...జగన్ ల గురించి కేశినేని సంచలన కామెంట్స్...!
X

విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచిన నేత కేశినేని నాని. ఆయన ముక్కుసూటికి మారు పేరు.ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొడతారు. మాట పడే నైజం కాదు. ఒక విధంగా స్ట్రైట్ గా వెళ్లే నేత కేశినేని నాని అని చెప్పుకుంటారు. ఇష్టం లేకపోతే ముఖం మీదనే చెప్పేస్తారు. లేకపోతే అప్పట్లో చంద్రబాబు ఢిల్లీకి వస్తే ఆయనకు పుష్ప గుచ్చం తాను ఇవ్వడానికి కూడా కేశినేని నాని నిరాకరించిన సంగతి ఆ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా కేశినేని నాని మరోమారు టీడీపీ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదంటూ ఆయన పెద్ద బాంబే పేల్చారు. చంద్రబాబులో ఉన్నది నటన అని ఆయన కొత్త మాట చెప్పారు. బాబు నటన చేస్తే జగన్ లో మాత్రం తనకు కనిపించింది నిజాయతీ అని అన్నారు.

జగన్ నిజాయతీగా వ్యవహరిస్తారు అని ఆయన అన్నారు. అందుకే తనకు నచ్చారని చెప్పారు. తెలుగుదేశంలో ఉన్నపుడే తాను ఈ మాటలు తమ పార్టీ నేతలకు చెబుతూ వచ్చాను అని నాని అనడం విశేషం. చంద్రబాబుని నమ్మితే మునిగినట్లే అని అప్పట్లోనే దేవినేని అవినాష్ కి తాను చెప్పానని చివరికి అదే ఆయన విషయంలో జరిగింది అని అన్నారు.

మరో వైపు చూస్తే విజయవాడ ఎంపీ పరిధిలో వైసీపీ అత్యంత పటిష్టంగా ఉందని కేశినేని నాని విశ్లేషించారు. వైసీపీ బలం తొంబై శాతం ఉంటే టీడీపీ బలం జస్ట్ పది శాతమే అని ఆయన తనదైన సర్వే నివేదికను వినిపించారు. అందుకే తాను ముచ్చటగా మూడోసారి కూడా గెలుస్తాను అని నాని ధీమాగా చెప్పారు.

వైసీపీ నేత దేవినేని అవినాష్ మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున ప్రజలు క్యాడర్ వస్తారని అదే టీడీపీ నేతలు మీటింగ్ పెడితే పట్టుమని పాతిక మంది కూడా రారని కేశినేని సెటైర్లు వేశారు. అదే వైసీపీకి టీడీపీకి తేడా అని ఈ ఎంపీ అంటున్నారు. మొత్తం మీద వైసీపీ నేతగా మారాక కేశినేని నాని తన మాటల పదును పెంచేశారు. ఆయన గట్టిగానే టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. మరి దీనికి తమ్ముళ్ళ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.