విజయవాడ ఎంపీ గ్రాఫ్.. ప్లస్సులు.. మైనస్సులు ఇవే..!
విజయవాడ ఎంపీగా ఉన్న నాయకులకు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలకు మధ్య చాలా తేడా ఉంటుంది. విజయవాడ ఎంపీగా ఉన్న వారు.. గతంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శించారు.
By: Garuda Media | 13 July 2026 8:00 PM ISTవిజయవాడ ఎంపీగా ఉన్న నాయకులకు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలకు మధ్య చాలా తేడా ఉంటుంది. విజయవాడ ఎంపీగా ఉన్న వారు.. గతంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శించారు. పర్వతనేని ఉపేంద్ర నుంచి రాజగోపాల్ వరకు.. ఆ తర్వాత రెండు సార్లు విజయం దక్కించుకున్న కేశినేని నాని కూడా రాజకీయంగా దూకుడు చూపించారు. దీంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్ని పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న.
రెండేళ్ల ఎంపీగా.. కేశినేని చిన్ని ఏం చేశారు? ఆయన ఎలాంటి అడుగులు వేశారు? అనేది కీలకం. అభివృద్ధి విషయాన్ని తీసుకుంటే.. కేంద్రం ఇస్తున్న ఎంపీలాడ్స్‌ను ఆయన ప్లేగ్రౌండ్స్‌కు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. తద్వారా యువతను ఆకర్షించే మంత్రం పఠిస్తున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పెద్దగా చేపట్టలేకపోతున్నారు. నగరాల్లో మైలవరం, తిరువురూ, విజయవాడ వంటి చోట్ల పర్యటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు.. వివాదాల కేంద్రంగానే చిన్ని పేరు వినిపిస్తోంది. కుటుంబ వివాదాలతో పాటు.. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోవడం వంటివి కూడా ఆయనకు మైనస్‌గా మారాయి. ఇప్పటికి రెండేళ్ల కాలంలో విజయవాడలో నాలుగు ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి కొంత మేరకు నగరానికి మంచి పేరు తెచ్చాయి. కానీ, ఎంపీగా ఆయనకు పడాల్సిన మార్కులు తగ్గాయి. దీనికి కారణం.. వివాదాలేనని అంటారు. మరీ ముఖ్యంగా ఎంపీగా ఆయన సమన్వయం చేసుకోలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఫలితంగా విజయవాడ ఎంపీగా కేశినేని నాని.. ఈ రెండేళ్ల కాలంలో ఆశించిన మేరకు.. ప్రజల నుంచి సానుభూతి దక్కించుకోలేకపోయారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అయినా.. ఆయన తన పనితీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉన్నంత మాత్రాన.,. ప్రజల్లో లేకపోయినా ఫర్వాలేదు అనే ధోరణిని విడనాడాలి. క్షేత్రస్థాయి పర్యటనలు పెంచడంతో పాటు.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. అప్పుడే ఎంపీగా చిన్ని సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
