బీఆర్ఎస్‌లో ఏమోకానీ.. వైసీపీలో పండగే!
నిజం. కొన్ని కొన్ని కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అవి వ్యక్తులకైనా.. రాజకీయాలకైనా.. కూడా!. ఎక్కడో ఏదో జరుగుతుంది. మనకు సంబంధం ఉండదు.
By: Garuda Media | 22 Dec 2025 1:26 PM ISTనిజం. కొన్ని కొన్ని కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అవి వ్యక్తులకైనా.. రాజకీయాలకైనా.. కూడా!. ఎక్కడో ఏదో జరుగుతుంది. మనకు సంబంధం ఉండదు. కానీ, మనకు మేలు జరుగుతుంది.. లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో కీడు కూడా జరుగుతుంది. ఏదేమైనా.. ఇలాంటి ఘటనలనే కార్యకారణ సంబంధాలుగా పేర్కొంటారు. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి ఆనందమే నెలకొంది. తమ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు ను ఎవరు తిట్టి పోసినా.. వైసీపీలో ఆనందమే!.
ఎక్కడో ఎవరో ఏదో అంటే.. దాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి పండగ చేసుకోవడం కామన్‌గా మారింది. అం దునా.. కేసీఆర్ వంటి బలమైన `మిత్రుడే` కామెంట్స్ చేస్తే.. ఇక చెప్పేది ఏముంటుంది. తాజాగా వైసీపీలో ఇదే జరిగింది. చంద్రబాబును కేసీఆర్ కొన్ని కొన్ని విషయాలను చూపి.. విమర్శలు గుప్పించారు. పాల మూరు జల వివాదం సహా.. విశాఖ పెట్టుబడులపైనా చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. వాస్తవానికి కేసీఆర్ కు పాలమూరుకు అంటే.. సంబంధంఉంది. ఆయన కామెంట్లు చేయొచ్చు.
కానీ, విశాఖ పెట్టుబడులకు.. కేసీఆర్‌కు ఏంటి లింకు? అనేది ప్రశ్న. పైగా.. తన రాష్ట్రం కాదు.. తన రాజకీ యాలు కాదు. చంద్రబాబు ఇప్పటి వరకు కేసీఆర్‌పై విమర్శలు చేసింది కూడా లేదు. అయినా.కేసీఆర్ తాజాగా చంద్రబాబు పెట్టుబడులపై సెటైర్లు పేల్చారు. తద్వారా.. పరోక్షంగా ఆయన వైసీపీకి మేలు చేస్తు న్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిణామమే వైసీపీలో జోష్‌ను నింపింది. పతాక శీర్షికల్లో కేసీఆర్‌ను ప్రస్తుతించారు. అంతేకాదు.. కేసీఆర్ గురించి వైసీపీ వర్గాల్లో ప్రత్యేక చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
నిజానికి బీఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ ఆగమనం.. సంతోషం నింపాలి. అది జరిగిందో లేదో తెలియదు కానీ.. కూకట్‌పల్లిలో వైసీపీ నాయకుడు ఒకరు మాత్రం కేసీఆర్.. చంద్రబాబుపై చేసిన కామెంట్ల అనంతరం.. ఇంటి ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక, ఏపీలోనూ జగన్ ఇంటి ముందుకు భారీ ఎత్తున కేసీఆర్ కటౌట్లు వెలిశాయి. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. కేసీఆర్ వ్యాఖ్యలు.. వైసీపీలో కొత్త జోష్‌నే నింపాయని చెప్పాలి. మరి ఇది ప్లస్సా.. మైనస్సా.. అనేది కాలమే తేల్చాలి.
