Begin typing your search above and press return to search.

చంద్రబాబును వదలని కవిత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు

By:  Tupaki Desk   |   29 May 2025 3:11 PM IST
చంద్రబాబును వదలని కవిత
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించలేదని చంద్రబాబు అనడం పూర్తిగా అవాస్తవమని, ఇది హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరిని కవిత తీవ్రంగా ఖండించారు. ప్రజాభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశం జరిగిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టు అంశం తెరపైకి వచ్చిందని ఆమె ఆరోపించారు. దీని ద్వారా చంద్రబాబు వైఖరి ఎంత వ్యతిరేకంగా ఉందో స్పష్టమవుతోందని కవిత అన్నారు.

ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీ సక్రమంగా జరగలేదని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశంపై గతంలోనూ అనేక వివాదాలు చెలరేగాయని, చంద్రబాబు ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆమె ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా జల వివాదాలు పరిష్కారం కాకపోవడానికి చంద్రబాబు వైఖరే కారణమని కవిత పరోక్షంగా వ్యాఖ్యానించారు.

సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లోపించిందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, జల వివాదాల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని, వాటి