Begin typing your search above and press return to search.

కవిత రాజీనామా వెనుక అసలు కారణం ఇదే.. నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోందంటే..?

కుటుంబ పార్టీలో అంతర్గత విభేదాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఈ రోజు (బుధవారం, సెప్టెంబర్ 3) కవిత ప్రెస్ మీట్ లో తన కజిన్ సంతోష్ రావు, బావ హరీష్ రావులనే ఆమె టార్గెట్ చేశారు.

By:  Tupaki Desk   |   3 Sept 2025 5:00 PM IST
కవిత రాజీనామా వెనుక అసలు కారణం ఇదే.. నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోందంటే..?
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజీనామా తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ జాగృతి పేరిట కవిత చాలా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు వివిధ హోదాల్లో ప్రభుత్వంలో, పార్టీలో కవిత వివిధ హోదాల్లో పని చేశారు. దాదాపు రెండు టర్మ్ లు ఆమె కొనసాగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె ఆమెపై పార్టీలో ప్రజల్లో ప్రభ తగ్గడం మొదలైంది. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆమె కామెంట్లకు విసుగుచెందిన బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో ఆమె బుధవారం (సెప్టెంబర్ 3) మీడియా ముందుకు వచ్చింది. పార్టీలో జరుగుతున్న విషయాలను వివరించింది. ప్రెస్ మీట్ లో ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావుపైనే విమర్శలు గుప్పించింది. పార్టీలో మొదటి నుంచి తనకు తన తండ్రి, అన్నకు మధ్య వీరే విభేదాలు సృష్టించారని మండిపడింది. హరీశ్ రావు పార్టీని నాశనం చేసేందుకే పని చేశారని, ఎప్పుడూ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు పని చేయలేదని ఆరోపించింది. రేవంత్ రెడ్డితో అంటకాగుతూ తన తండ్రిని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి, తన పార్టీ అయిన బీఆర్ఎస్ సాధారణ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కవిత రాజీనామా వెనుక కథ..

ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత కవిత ద్వారా పార్టీకి చెడ్డపేరు రావడం మొదలైంది. ఆమె జైలులో ఉన్న సమయంలో తండ్రి, అన్న పెద్దగా పట్టించుకోలేదని కారణం ప్రజల మద్దతు పోతుందని భయం అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు సైతం వెలువరించాయి. ఈ నేపథ్యంలో ఆమె అప్పటి నుంచి పార్టీపై అక్కసుతో ఉందని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత తనకు పార్టీలో ముఖ్యమైన స్థానం ఇవ్వడం లేదని, తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చాలా సార్లు సన్నిహితులతో తెలిపినట్లు పార్టీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. అయితే కవిత పార్టీలో కొనసాగితే మరిన్ని చీలికలు వచ్చే ప్రమాధం ఉందని అందుకే వీలైనంత తొందరగా సస్పెండ్ చేయాలని అధినాయకత్వం యోచించినట్లు అప్పట్లో చాలా లీకులు వచ్చాయి. దీనిపై గతంలోనే ఎంపీ రఘునందన్ లాంటి వారు కామెంట్లు కూడా చేశారు. కవిత పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమని అన్నారు.

ప్రముఖంగా వారి పేర్లే..

కుటుంబ పార్టీలో అంతర్గత విభేదాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఈ రోజు (బుధవారం, సెప్టెంబర్ 3) కవిత ప్రెస్ మీట్ లో తన కజిన్ సంతోష్ రావు, బావ హరీష్ రావులనే ఆమె టార్గెట్ చేశారు. హరీష్ రావు మొదటి నుంచి పార్టీని నాశనం చేసేందుకు చూశారని, హుజురాబాద్ ఎన్నికల ఓటమికి కూడా ఆయనే కారణం అంటూ.. ఇక సంతోష్ రావు హరితహారంలో కోట్లాది రూపాయలను నాశనం చేశారని చెప్పారు. వీరిద్దరితో జాగ్రత్తగా ఉండాలని తండ్రిని, అన్నను హెచ్చరించి మరీ రాజీనామా చేశారు. కాలేశ్వరం కథ మొత్తం కేసీఆర్ మెడకు చుట్టింది కూడా హరీష్ రావు అన్నారు.

ఆ పార్టీలోకే వెళ్తే ఛాన్స్..!

తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ రాజకీయాల్లో దాదాప పదేళ్లకు పైగా ప్రస్థానాన్ని కొనసాగించిన కల్వకుంట్ల కవిత సీనియర్ నాయకురాలిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగారు. అయితే ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో రాజీనామాలు తప్పలేదు. అయితే ఏ పార్టీలోకి వెళ్తారని జర్నలిస్టులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లనని చెప్పారు. అయితే కవిత దశ, దిశ ఎటువైపు ఉంటుందని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ, ఇతర సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే...? ప్రస్తుతం పార్టీ నుంచి తొలగించిన కవిత ముందే ప్రకటించినట్లు బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లదని చెప్తున్నారు. అయితే తెలంగాణలో మరో పార్టీ పెడితే మనుగడ సాధించలేమని ఆమెకు తెలిసిందే. గతంలో షర్మిల పార్టీ సమయంలో ఆమె ఇతే విషయం చెప్పుకచ్చారు. కాబట్టి ఆమె మళ్లీ బీఆర్ఎస్ లోకే వెళ్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పార్టీలోని కీలక నాయకులపై విషం చిమ్మిన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వేడి తగ్గిన తర్వాత ఆమె తిరిగి మళ్లీ అదే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి పార్టీలో కుమ్ములాటలు లేకుండా చూడాలనే ఆమెను బయటకు పంపించారని, ఆ తర్వాత మళ్లీ చేర్చుకుంటారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెను కాంగ్రెస్, బీజేపీ చేరదీసినా పెద్దగా పట్టించుకోవని మళ్లీ ఆమె బీఆర్ఎస్ లోనే కొనసాగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు.