Begin typing your search above and press return to search.

రాజకీయ సెగ పెరిగిన వేళ కాపునాడు మీటింగ్

ఆగస్ట్ 13న కాకినాడ వేదికగా ఏపీ కాపునాడు ఒక సీరియస్ మీటింగ్ ని అరెంజ్ చేసింది

By:  Tupaki Desk   |   31 July 2023 5:30 PM GMT
రాజకీయ సెగ పెరిగిన వేళ కాపునాడు మీటింగ్
X

కాపునాడు అన్నది మూడున్నర దశాబ్దాలుగా తెలుగు జనాలకు తెలిసినద పేరే. ఏపీలో బలమైన సామాజిక వర్గం తమ ఆశలను ఆకాంక్షలను సాధించుకునే దిశగా ఏర్పాటు అయింది. కాపునాడు శక్తిని ఉమ్మడి ఏపీ కూడా చవిచూసింది. ఇక 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలవడం వెనక కాపుల మద్దతు కూడా కీలకం అని ఒక అంచనా ఉంది.

కాపులకు సుదీర్ఘమైన కోరిక రాజ్యాధికారం. ఏపీలో వారి జనాభా సంఖ్య అటూ ఇటూగా పాతిక శాతంగా ఉంది. అలాంటిది సీఎం పదవి మాత్రం అందని పండు అయింది. మరి 2024లో అయినా ఆ కోరిక తీరుతుందా అన్నది ఒక ప్రశ్నగా ఉన్న నేపధ్యంలో ఆగస్ట్ 13న కాకినాడ వేదికగా ఏపీ కాపునాడు ఒక సీరియస్ మీటింగ్ ని అరెంజ్ చేసింది.

ఏపీలో ప్రస్తుతం అధికార వైసీపీ జనంలోకి వెళ్తోంది. ఆ పార్టీ వ్యూహాలు కార్యక్రమాలు చకచకా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. వచ్చే సారి కూడా తమదే అధికారం అని చాటి చెబుతోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోనే ఉంటోంది. లోకేష్ అయితే గత ఆరు నెలలుగా పాదయాత్ర చేస్తూ జనాలను కలుస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు చంద్రబాబు కూడా తిరుగుతున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండు విడతలు పూర్తి అయింది. మూడవ విడతను ఆయన తొందరలో ప్రారంభించనున్నారు. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వేడిని ఊదుకుంటూ బిజీగా ఉన్న వేళ కాపునాడు మీటింగ్ పెట్టడం అంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులను ఏకం చేయడం కోసం ఈ సమావేశం అని అంటున్నారు.

మరి కాపునాడు మీటింగులో రాజకీయ తీర్మానాలు ఉంటాయనే అంటున్నారు. ఏపీలో రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని కాపునాడు పిలుపు ఇస్తుందని అంటున్నారు. మరి కాపునాడు ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఏపీలో జనసేన వైపుగా కాపులు నెమ్మదిగా పోలరైజ్ అవుతున్నారు. మరి కాపునాడు కూడా తమ సొంత సామాజిక వర్గం నాడిని పట్టుకుని జనసేనకే జై కొట్టే అవకాశాలు ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.

అదే విధంగా చూస్తే కాపులకు రాజ్యాధికారంతో పాటు అన్ని పార్టీలలో సీట్లు కూడా జనాభా ప్రాతిపదికగా కావాలని కోరవచ్చు అని అంటున్నారు. ఇక కాపునాడు రాష్ట్ర స్థాయి సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరవుతాయా అందులో వైసీపీ ఉంటుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది. వైసీపీ హాజరైతే కాపునాడు సభ ఏ తీరుగా సాగుతుంది అన్నది కూడా ఉత్కంఠ రేపుతోని. మరో రెండు వారాలలో కాపునాడు సభ జరగనుంది. ఆ సభ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టించడం ఖాయమనే అంటున్నారు.