Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ క్రేడిట్ మరొకరికి ఇస్తారా... మీడియాకు పాల్ శాపనార్థాలు!

అవును... నిజంగా తాను కష్టపడిన విషయంలో తెలుగు మీడియా తన క్రెడిట్ తనకు ఇవ్వదంటూ కేఏ పాల్ చాలా సార్లు శాపనార్థాలు పెట్టిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 3:30 PM GMT
స్టీల్ ప్లాంట్ క్రేడిట్ మరొకరికి ఇస్తారా... మీడియాకు పాల్ శాపనార్థాలు!
X

ఏపీ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. రాజకీయంగా ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. కాకపోతే... అలుపెరగకుండా పోరాడుతుంటారని ఆయన ఫ్యాన్స్ చెబుతుంటారు.. పైగా ఆయనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వడంలో తెలుగు మీడియా చిన్న చూపు చూపిస్తుందంటూ వాపోతుంటారు! ఈ క్రమంలో తాజాగా కేఏ పాల్ కూడా ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం కలగలిపిన స్వరంతో ఒక వీడియో విడుదల చేశారు.

అవును... నిజంగా తాను కష్టపడిన విషయంలో తెలుగు మీడియా తన క్రెడిట్ తనకు ఇవ్వదంటూ కేఏ పాల్ చాలా సార్లు శాపనార్థాలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అదే విషయాన్ని వెల్లడించారు కేఏ పాల్. ఇందులో భాగంగా... విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో తాను గొంతుపోయేలా వాదించి ఆర్డర్ తెస్తే మీడియా తన కృషిని గుర్తించకుండా ఆ క్రేడిట్‌ ను జేడీకి, ఇతరులకు అపాదిస్తుందంటూ పాల్ తప్పుబట్టారు.

ఈ విధంగా తనలా కష్టపడిన వారికి కాకుండా మరెవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనమవుతాయంటూ శాపనార్ధాలు పెట్టారు! ఫిబ్రవరి 21న కోర్టులో కేసు ఫైల్ చేసి, పదిసార్లు వాదించి ఏప్రిల్‌ 25న ఆర్డర్స్ తీసుకొచ్చానని.. ఫలితంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులు ఒక్క ఇంచూ కూడా అమ్మకుండా ఆర్డర్ వచ్చాయని కేఏ పాల్ తెలిపారు.

ఇదే సమయంలో... హైకోర్టులో మాజీ జేడీ లక్ష్మీనారాయణతోపాటు మరికొందరు పిటిషన్లు వేసినా... అవి తన తర్వాతే లిస్టు అయ్యాయని, జేడీ ఒక్కసారి కోర్టుకు రాలేదని చెప్పిన పాల్... తాను ఎంతో కష్టపడి గవర్నమెంటు ఫ్లాంట్‌ ను అమ్మకుండా అర్డర్ తెస్తే.. ఆ క్రెడిట్ ను మరెవరికో ఇవ్వడం సరికాదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు! ఈ సందర్భంగా సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకు ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలో సుమారు రెండు నెలలు కష్టపడి.. పది రోజులు వాదించి.. 40 రోజులు ప్రిపేర్ చేసి.. కోర్టు చుట్టు రాత్రింబవళ్లు తిరిగానని పాల్ తెలిపారు. స్టిల్ ప్లాంట్ అమ్మకుండా ఇంత కష్టపడిన నన్ను కాదని మీడియా ఇతరులకు క్రెడిట్ ఇవ్వడాన్ని దేవుడి క్షమించడని, వారి కుటుంబాలు సర్వనాశనమైపోతాయని పాల్ శాపనార్ధాలు పెట్టారు! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.