Begin typing your search above and press return to search.

బాబు పవన్ లకు అందనంత ఎత్తులో జగన్ వ్యూహాలు...?

ఢిల్లీ రాజకీయాలనూ ఔపాసన పట్టేశారు. ఒక్కసారి తన చేతికి వచ్చిన సీఎం పదవిని జగన్ ఊరకే వదులుకుంటారా ఇది అందరికీ కలిగే సందేహమే.

By:  Tupaki Desk   |   18 Sep 2023 9:30 AM GMT
బాబు పవన్ లకు అందనంత ఎత్తులో జగన్ వ్యూహాలు...?
X

వైసీపీ అధినేత జగన్ పట్టుదల ఎలాంటిదితో ఏపీ ప్రజలకే కాదు యావత్తు దేశ ప్రజలకు కూడా తెలుసు. తండ్రి వైఎస్సార్ చనిపోయిన నాటికి జస్ట్ మూడు నెలల ఎంపీగా రాజకీయ అనుభవం కలిగిన జగన్ సీఎం సీటు మీద నాడే టార్గెట్ చేశారని అంటారు. దాన్ని ఆయన గిర్రున ఒక దశాబ్ద కాలం తిరిగేసరికి ఎలా సాధించారో అందరికీ తెలుసు. జగన్ అనుకుంటే ఎంతకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు, ఆయనది దూకుడుతో చేస్తే రిస్కీ పాలిటిక్స్.

ఈ విషయంలో ఆయన పాత రాజకీయాన్ని పక్కన పెట్టేసి మరీ తనదైన కొత్త రాజకీయాన్ని సెట్ చేస్తారు. జగన్ ఒక్కడుగా ఉన్న రోజులలోనే అంతటి పట్టుదల ఉంటే ఇపుడు ఆయన సీఎం గా దాదాపుగా అయిదేళ్లకు దగ్గర అయ్యారు పుష్కర కాలం మించిన రాజకీయ అనుభవం ఉంది. విపక్షంలో చేశారు, అధికార పక్షమూ చూశారు.

ఢిల్లీ రాజకీయాలనూ ఔపాసన పట్టేశారు. ఒక్కసారి తన చేతికి వచ్చిన సీఎం పదవిని జగన్ ఊరకే వదులుకుంటారా ఇది అందరికీ కలిగే సందేహమే. చంద్రబాబుకూ అధికారం మీద మోజు ఉంది. కానీ ఆయనకు వ్యూహాలు ఉన్నాయి కానీ వాటిని పరిమితమైన తీరులో మాత్రమే అమలు చేయగలరు. పైగా ప్రజాదరణ విషయంలో కొంచెం తక్కువ ఉంటారు.

పొత్తుల పేరిట ఆయన పక్క పార్టీల వైపు చూస్తారు. దాంతో పాటు ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ చేస్తారు. ఎన్నో భయాలు మొహమాటాలూ రాజీలు బాబుకు అలవాటుగా మారిపోయాయి. పైగా ఒక డెసిషన్ తీసుకోవాలంటే చంద్రబాబు చాలా ఆలోచిస్తారు అని అంటారు. దానికి పూర్తిగా భిన్నంగా జగన్ ఉంటారు.

అందుకే ఆయన ఏనాడో జగన్ పవన్ ల అనివార్యం అని ఊహించే ప్లాన్ బీ ప్లాన్ సీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇపుడు అదే జరిగింది. దాంతో ప్లాన్ బీ కి ఆయన సిద్ధం అయిపోతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు అని రెండేళ్ల క్రితం పవన్ గుప్పిట తెరచి తన వ్యూహం ఏంటో చెప్పేశారు. నిజానికి దాని కంటే ముందు నుంచే జగన్ పాజిటివ్ ఓటుని బిల్డప్ చేసే పనిలో పడ్డారు. ఆ మాటకు వస్తే డే వన్ నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు.

నవరత్నాల పేరిట తాను ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు అయ్యేలా చూసుకోవడం కోసం అప్పులు ఎన్ని అయినా చేస్తూ వెళ్లారు. ఈసారికి గెలిస్తే చాలు మూడు దశాబ్దాల రాజకీయం తన సొంతం అవుతుంది అన్న అజెండాతోనే జగన్ ప్లాన్ వర్కౌట్ చేస్తూ పోయారు. ఇపుడు కూడా ఆయన అదే మరింత జోరుగా చేయబోతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అంతా కలసి ఒక్కటై ఒడిసి పట్టాలనుకుంటున్న వేళ ఆ వ్యతిరేకతను వీలైనంతంగా తగ్గించుకోవడం. ఆ ఓటుని పలుచన చేయడం మీద జగన్ ఫుల్ ఫోకస్ పెట్టేశారు. యాంటీ ఇంకెంబెన్సీ యాభై శాతం పైన ఉంటేనే విపక్షాలు కూటమి కట్టినా వర్కౌట్ అవుతుంది. దాన్ని ఏ నలభై నుంచి ముప్పైకి తగ్గించేస్తే మొత్తానికి మొత్తం ఓట్లు వారు కొల్లగొట్టినా పాజిటివ్ ఓటుతో మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చేస్తున్నది అదే.

అలాంటి ఫార్ములాతోనే జగన్ ఏపీలో యాక్షన్ ప్లాన్ కి రెడీ అయ్యారు. పల్లెకు పోదాం చలో అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వారం పాటు అవి జరుగుతాయి. ఆ తరువాత జగన్ నేరుగా జనంలోకి వస్తారని అంటున్నారు. జగన్ పూర్తిగా గ్రామిణ ప్రాంతం ఓటు బ్యాంక్ మీదనే గురి పెట్టేశారు. అలగే సెమీ రూరల్ పట్టణాలలో కూడా వైసీపీకి అనుకూల పరిస్థితి ఉంది.

దాంతో ఏపీలో నూటికి డెబ్బై శాతం ఉండే ఈ ఓటింగ్ ని అంది పుచ్చుకోవాలని బ్రహ్మాండమైన ప్లాన్ లో జగన్ ముందుకు కదులుతున్నారు. గ్రామాల్లో సంక్షేమ పధకాలు నూటికి తోంబై శాతానికి పైగా అమలు అవుతున్నాయి. అలాగే ఆర్బీకే సెంటర్లు, సచివాలయాలు అన్నీ రూరల్ లోనే ఏర్పాటు చేశారు. నాడు నేడు పేరుతో పాఠశాలకు, వైద్య శాలలు అభివృద్ధి చేయడం, హెల్త్ సెంటర్లను నిర్మించడం వంటివి జగన్ గ్రామీణం పైన పెట్టిన శ్రద్ధకు మచ్చు తునకలు.

ఈ కారణంగా పల్లెలలో సంక్షేమం అభివృద్ధి రెండూ కళ్ల ముందే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక పల్లెకు పోదాం కాన్సెప్ట్ తో ప్రతీ సచివాలయం పరిధిలో పార్టీ నెతలు భేటీ కానున్నారు. గ్రామలలో పధకాలు దక్కని వారిని చూసి మరీ వాటిని అందించేలా చూడడంతో పాటు, ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం వెతికే పనిలో పార్టీ నేతలు ఉంటారని అంటున్నారు.

ఈ కర్యక్రమంలో భాగంగా పార్టీకి చెందిన ప్రతీ మండలాధ్యక్షుడూ సచివాలయం పరిధిలో ఆయా గ్రామాలలోని పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తారు. ఈ భేటీలో భాగంగా పల్లె నిద్రతో పాటు రాత్రి భోజనం అక్కడే చేస్తారు. గ్రామాలలో వార్డులలో పార్టీ నేతలలో ఉన్న విభేదాలను తొలగిస్తారు అని అంటున్నారు.

అలాగే పార్టీలోకి కొత్తవారిని కూడా చేర్చుకుంటారని అంటున్నారు. ఇలా పార్టీని పటిష్టం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలతో పంచుకుంటూ రూరల్ సెమీ రూరల్ ఓటింగ్ ని ఫుల్ గా పాజిటివ్ గా మార్చేందుకు జగన్ మాస్టర్ స్కెచ్ నే గీస్తున్నారు. దీనికి సంబంధించి తొందరలోనే పార్టీ నేతలతో మాట్లాడి టోటల్ ప్రోగ్రాం ని అనౌన్స్ చేస్తారని అంటున్నారు.