Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి జగన్ కి వారి నుంచి ప్రాణహాని....!?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రాణ హాని ఉందని ఇంటలిజెన్స్ నిఘా విభాగం సంచలనమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది

By:  Tupaki Desk   |   22 Feb 2024 6:18 PM GMT
ముఖ్యమంత్రి జగన్ కి వారి నుంచి ప్రాణహాని....!?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రాణ హాని ఉందని ఇంటలిజెన్స్ నిఘా విభాగం సంచలనమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మావోయిస్టులు సంఘ విద్రోహ శక్తులు, వ్వవస్థీకృత క్రిమినల్స్, టెర్రరిస్టుల నుంచి పెను ముప్పు పొంచి ఉందని పేర్కొంది. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలసిన అవసరాన్ని కూడా సూచించింది.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ అంతా విస్తృతంగా పర్యటించాల్సి ఉంది. దాంతో పాటు ఆయన ప్రజలతో కనెక్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ఈ నివేదిక రావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం రెండు ప్రత్యేక ఆధునాతన హెలికాప్టర్లను విజయవాడ, విశాఖపట్నంలలో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ హెలికాప్టర్లను ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా లీజుకు తీసుకుంది. రెండు ఇంజన్ల కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకుంటున్నారు. ఇవి అత్యాధునికం అని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే 2010 నాటి హెలికాప్టర్ నే ప్రభుత్వ వాడుతోంది. ఇది చాలా పాతదని నిర్ధారణకు వచ్చారు.

దాంతో ఇపుడు రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారు. అలాగే ఒక్కో హెలికాప్టర్ కి నెలకు 1.91 కోట్ల రూపాయలు వంతున చెల్లించనున్నారు. ఇదిలా ఉంటే జగన్ కి ఇప్పటికే జెడ్ క్యాటగిక్రీ భద్రతను కల్పిస్తున్నారు. జగన్ సీఎం అయ్యేనాటికి ఆయన భద్రత తక్కువగానే ఉండేది. మధ్యలోనే హఠాత్తుగా దానికి పెంచారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. దాని మేరకు సీఎం భార్యా బిడ్డలకు ఎక్కడ ఉన్నా పూర్తి స్థాయి సెక్యూరిటీని అందించాలని కూడా నిర్ణయించారు. దాంతో జగన్ భద్రత విషయంలో అపుడే చర్చ మొదలైంది. ఇపుడు ఇంటలిజెన్స్ వర్గాల నివేదికతో పూర్తి వివరాలు వస్తున్నాయి.

సీఎం జగన్ విషయంలో చూసుకుంటే ఆయన రాజకీయంగా ఒంటరి పోరు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం గత అయిదేళ్ళలో తీసుకున్న నిర్ణయాలు మెచ్చుకున్న వారు ఉన్నారు. కొన్ని వర్గాలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటు మావోలు ఎపుడూ పాలక పక్షాలకు వ్యతిరేకం. ఇక టెర్రరిస్టుల తీరు చూస్తే వారు సంచలనం కోసం చూస్తారు. వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్స్ విషయం కూడా చర్చకు వస్తోంది. ఏ విధంగా చూసినా ఎన్నికల సీజన్ లో జగన్ జనంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయన భద్రత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందనే అంటున్నారు ఇది చాలా సున్నితమైన అంశంగా కూడా ఇంటలిజెన్స్ చెప్పడం విశేషం.