Begin typing your search above and press return to search.

రాప్తాడులో రఫ్ఫాడించిన జగన్... విపక్షాలకు సరికొత్త చురకలు!

ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కనీవినీ ఎరుగరి రీతిలో అన్నట్లుగా ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 1:49 PM GMT
రాప్తాడులో రఫ్ఫాడించిన జగన్... విపక్షాలకు సరికొత్త చురకలు!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఇందులో భాగంగా... "సిద్ధం" సభలతో కార్యకర్తల్లో సమరోత్సాహం నింపుతూ, ప్రజలకు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెబుతున్నారు. ఈ క్రమంలో జరిగిన రాప్తాడు "సిద్ధం" సభలో సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కనీవినీ ఎరుగరి రీతిలో అన్నట్లుగా ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు.


అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలపై జగన్ పంచుల డోసు రోజు రోజుకీ పెరుగుతుంది. ఇందులో భాగంగా తాజాగా... "ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి" అంటూ టీడీపీ, జనసేనకు సరికొత్త చురకలంటించారు జగన్. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా సాగుతున్న కుర్చీలు మడతపెట్టి అనే డైలాగ్ ను తనదైన శైలిలో చెప్పారు.

ఇందులో భాగంగా... గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి 23 సీట్లకు తగ్గించారని చెప్పిన జగన్... ఇప్పుడు మళ్లీ ఆయనను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇదే సమయంలో ఎగ్గొట్టేవాడు.. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు.. మానిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు.. అంటూ చంద్రబాబుకు సీఎం జగన్‌ చురకలు అంటించారు.

ఇలా సాగిన జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం..!

2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య.. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎనుకునే ప్రక్రియ మాత్రమే కాదు. ఐదేళ్లకాలంలో ఇంటింటికి మన పభ్రుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి... డ్రామాలు ఆడే చందబ్రాబుతో యుద్ధానికి మీరు సిద్దామా..? ఈ యుద్ధం, మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు.. మాట తప్పటమే ఆలవాటుగా ఉన్న పెత్తందారలకు మధ్య యుద్ధం అంటూ జగన్ హోరెత్తించేశారు.

ఇదే సమయంలో... వేరే రాష్ట్రాల్లో ఉంటు మోసం చేయటానికి వచ్చి పోతున్న నాన్ రెడిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతుంది ఈ యుద్ధం.. బాబు వంచన భరించలేకే కదా, ఐదేళ్లక్రితం పజలంతా చొక్క మడతేసి బాబుకు ఉన్న కూర్చీని మడిచి, వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కి తగ్గించారు అని క్లారిటీ ఇచ్చి... ఈ కుర్చీ మడత కార్యక్రమం 2019లో ప్రారంభమైపోయిందని చెప్పకనే చెప్పారు.

అదే విధంగా... పేదలు వైద్యం కోసం రాకూడదన్న, గడపగడపకు వైద్యం చేరాలన్న, ప్రతీ కుటుంబానికి మంచి జరగాలన్నా.. మనందరి ప్రభుత్వానికి నిలబడాలని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అని కార్యకర్తలకు సూచించిన జగన్... జగన్ తన పాలనలో ప్రజలకు మంచి జరగలేదు అని చందబ్రాబు నిజంగా నమ్మితేపొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నావు బాబూ అని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... మీ బిడ్డ 125సార్లు బటన్ నోక్కి లంచం లేకుండా నేరుగా మీ ఖాతాలో వేశారా అని అడగండి.. ప్రజలు మొదటిసారి ఆశీర్వదిస్తే ఇంత మంచి చేయగలిగాం, రెండువసారి మూడవసారి ఆశీర్వదిస్తే ఇంకేంత మంచి జరుగుతుందో ఆలోచించండి అని జగన్ ప్రజలను కోరారు. ఇంత మంచి చేసిన పభ్రుత్వానికి మద్ధతుగా, వారిమంచి భవిష్యత్తుకు ప్రజలు రెండు బటన్లు నోక్కాలని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అని జగన్ .. కార్యకర్తలకు సూచించారు.

ఇదే సమయంలో... పేదవారి భవిష్యత్తుకు అండగా నిలిచామని.. ఇచ్చిన మాట నేరవేర్చామని చెప్పిన జగన్... అందుకే వచ్చే ఎన్నికల్లో 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు గెలవాలని అడుగుతున్నట్లు తెలిపారు. అలా పరిపాలనలో మనం తగ్గలేదని చెప్పిన జగన్.. అందువల్లే ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలోనూ తగ్గకూడదు అని అన్నారు. ఈ క్రమంలో మరికోన్ని రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని జగన్ అడిగారు.

ప్రధానంగా... ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చందబ్రాబు వయసు 80కి వెళ్లిపోతుందని చెప్పిన జగన్... ఇక టీడీపీ రూపురేఖలు కూడా కనిపించవనిం, అందువల్లే ఈ ఎన్నికలు చాలా కీలకమని.. అందుకే పెత్తందారు ఏకమవుతున్నారని అన్నారు. ఇక... ఇప్పుడు వైసీపీ చేస్తున్న యుద్ధం చందబ్రాబుతో మాత్రమే కాదని.. ఒక పక్క పచ్చమీడయాతో యుద్ధం చేస్తున్నామని.. వీరికితోడు ఒక దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నామని.. త్వరలో జాతీయ పార్టీని కూడా వారితో తెచ్చుకుంటున్నారని జగన్ తెలిపారు.

ఈ క్రమంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా చెప్పిన జగన్... ఈ ఎన్నికలు పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించేవే అని తెలుపుతున్న అని చెప్పిన జగన్... పేదవాడి భవిష్యత్తు మారాలన్నా.. పేదవాడి పిల్లలు పెత్తందారులతో పోటీ పడాలన్నా.. పెత్తందారుల పార్టీని నాశనం చేసే పరిస్థితి రావాలని అన్నారు. అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవని గుర్తుచేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వం కలకాలం ఉండాలని, మరో ఆవకాశం ఇవ్వాలని కోరుతూ శెలవు తీసుకుంటున్న అంటూ ముగించారు.