Begin typing your search above and press return to search.

విపక్షాల ది గ్లోబెల్స్ ప్రచారం...జగన్ ది నిస్సహాయతేనా !

ఈ సందర్భంగా తన ప్రభుత్వ హయాంలో నాలుగు పోర్టులతో పాటు భోగాపురం ఎయిర్ పోర్టు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు, పది ఫిషింగ్ హార్బర్స్ ని అభివృద్ధి చేశామని వివరించారు.

By:  Tupaki Desk   |   9 May 2024 4:08 AM GMT
విపక్షాల ది గ్లోబెల్స్ ప్రచారం...జగన్ ది నిస్సహాయతేనా !
X

ఎంతో అభివృద్ధి చేశామని అసెంబ్లీలో అలాగే ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ సందర్భంగా గణాంకాలతో సహా వివరించిన జగన్ అయిదేళ్ళ పాటు విపక్షాలు చేసిన ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోయారు అంటే దానికి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన జవాబు వారిది గోబెల్స్ ప్రచారం అని. ఒక ప్రముఖ మీడియా చానల్ ఇంటర్వ్యూలో జగన్ అనేక అంశాల మీద మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వ హయాంలో నాలుగు పోర్టులతో పాటు భోగాపురం ఎయిర్ పోర్టు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు, పది ఫిషింగ్ హార్బర్స్ ని అభివృద్ధి చేశామని వివరించారు.

అలాగే విశాఖలో ఇంఫోసిస్, అదానీ సెంటర్ లను ఏర్పాటు చేశామని అన్నారు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పెట్టుబడులు చూస్తే చంద్రబాబు హయాంలో ముప్పయి రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే వస్తే తన హయాంలో లక్ష కోట్ల రూపాయల దాకా వచ్చాయని ఆయన వివరించారు. గ్రామాల రూపురేఖలు మార్చామని విద్యా వైద్య రంగాలలో సంస్కరణలు తెచ్చమని ఆయన చెప్పారు.

మరి ఇన్ని చేసిన మీ ప్రభుత్వం వాటిని ఎందుకు చెప్పుకోవడంలేదని యాంకర్ ప్రశ్నించగా తానే అనేక సభలలో చెప్పాను అసెంబ్లీలో కూడా పలు మార్లు చెప్పాను అని జగన్ అన్నారు. అయినా సరే విపక్షాలు వారితో బలంగా జత కలసిన అనుకూల మీడియా అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తూ వచ్చాయని జగన్ ఒక దశలో నిస్సహాయతనే వ్యక్తం చేశారు. ఎంత కన్న చెబుతామని ఆయన అన్నారు. కళ్ళ ముందు జరిగే అభివృద్ధిని కాదని అంటే ఏమి చేయగలమని ఆయన ప్రశ్నించారు.

అప్పుల విషయంలో కూడా చంద్రబాబు కంటే తానే తక్కువ చేశాను అని అది కాగ్ నివేదికతో పాటు రిజర్వ్ బ్యాంక్ లెక్కల్లోనూ ఉందని ఆయన స్పష్టం చేశారు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క ఏడాది లోటు బడ్జెట్ లేకుండా ప్రభుత్వాన్ని నడపలేదని ఆయన విమర్శించారు. తన హయాంలో చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల అభివృద్ధిలో వారు భాగం అయ్యారని తద్వారా అభివృద్ధి గ్రోత్ రేటు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చే స్థితిలో ఎపుడూ ఉండరని అన్నారు. తాను ఎంతో కష్టపడి అయిదేళ్ల పాటు ఏపీలో అన్ని వర్గాల కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నానని చంద్రబాబు ఏకంగా లక్షా అరవై అయిదు వేల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చారని, ఏటా ఈ పెనుభారం ఎలా భరిస్తామని ఆయన అన్నారు.

జనాలు చంద్రబాబు హామీలను నమ్మరని మరోసారి తానే ఏపీకి సీమె అవుతాను అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాను అప్పులు తెచ్చి పప్పు బెల్లాలుగా పంచుతున్నాను అని రాసిన టీడీపీ అనుకూల మీడియా పెద్దలు చంద్రబాబు శుష్క వాగ్దాలాను మాత్రం మొదటి పేజీలలో పెద్ద హెడ్డింగులు పెట్టి ప్రచారం చేస్తున్నారు అంటే వారికి రాష్ట్రం పట్ల బాధ్యత ప్రేమ లేవని కేవలం అధికార దాహమే ఉందని అన్నారు. తాను సంక్షేమ ఇస్తే శ్రీలంక అవుతుందని అన్నారని ఇపుడు అంతకు రెట్టింపు హామీలు ఇచ్చిన చంద్రబాబును ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించదని జగన్ నిలదీశారు.

మొత్తం మీద చూస్తే తాను చెప్పిందే చేస్తాను అన్నది ప్రజలకు తెలుసు అని వారు అమాయకులు కారు అని అభివృద్ధి ఎంత చేశానో సంక్షేమం ఎలా చేశానో ప్రజలకు తెలుసు అన్నారు తాను గోబెల్స్ ప్రచారాన్ని మాత్రం తిప్పికొట్టలేనని పరోక్షంగా జగన్ అంగీకరించారు.