Begin typing your search above and press return to search.

కార్యకర్తలతో జగన్ నేరుగా అనుసంధానం !

ఇపుడు ఆయన నేరుగా ప్రతీ నియోజకవర్గంలోని కార్యకర్తలతో నేరుగా భేటీ వేస్తారు అని ప్రచారం సాగుతోంది. అది ఎపుడూ ఏమిటి అన్నది తెలియదు కానీ కార్యకర్తలతో అధినేత ముఖా ముఖీ సమావేశం అవుతారు అని అంటున్నారు.

By:  Satya P   |   20 May 2026 9:39 AM IST
కార్యకర్తలతో జగన్ నేరుగా అనుసంధానం !
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ఓటమి పాలు అయ్యామో గురించించారు. పార్టీని సొంతం అనుకుని తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా 2019 ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు 2024 నాటికి పూర్తిగా గాలికి వదిలేశారు అన్నది బాగా ప్రచారంలో ఉంది. అందులో నిజం ఉందని వైసీపీ హైకమాండ్ కూడా భావిస్తోంది. అందుకే జగన్ కార్యకర్తలకు వైసీపీ 2.0 ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటిదాకా చెబుతూ వస్తున్నారు. ఇపుడు ఆయన నేరుగా ప్రతీ నియోజకవర్గంలోని కార్యకర్తలతో నేరుగా భేటీ వేస్తారు అని ప్రచారం సాగుతోంది. అది ఎపుడూ ఏమిటి అన్నది తెలియదు కానీ కార్యకర్తలతో అధినేత ముఖా ముఖీ సమావేశం అవుతారు అని అంటున్నారు.

ఐడీ కార్డులతో సహా :

వైసీపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జిలను నియమించింది. అక్కడ నుంచి మునిసిపాలిటీలు, మండలాలు, గ్రామాలు వార్డులు ఇలా బూత్ లెవెల్ దాకా కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ అయితే జోరుగా సాగుతోంది అని అంటున్నారు. ఇది పూర్తి కాగానే ప్రతీ కార్యకర్తకు పార్టీ తరఫున ఐడెంటిటీ కార్డు ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా కార్యకర్తలు ఈ ఐడెంటిటీ కార్డుల ద్వారా నేరుగా జగన్ తో మమేకం అయ్యేలా పార్టీ నిర్మాణం చేపడుతున్నామని నేతలు చెబుతున్నారు.

సముచిత స్థానం వారికే :

పార్టీలో కమిటీలు పూర్తి చేసిన తరువాత పనిచేసే వారికే పదవులు అన్న విధానాన్ని అమలు చేస్తారని అంటున్నారు. అలాగే వారి యోగ క్షేమాలు అధినాయకత్వం పట్టించుకుంటూ ఎప్పటికప్పుడు నేరుగానే వారితో కనెక్ట్ అయ్యేలా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నారు అని అంటున్నారు. ఇక జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. దాంతో జిల్లాల పర్యటనలో కార్యకర్తలతో ఆయన భేటీలు అవుతారని చెబుతున్నారు. పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ విషయాలను వారి ద్వారా అధినాయకత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు.

ఆహ్వానించతగినదే :

మొత్తం మీద చూస్తే ఈ తరహా మార్పు ఆహ్వానించతగినదే అనుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలో ఎపుడూ జీవగర్ర లాంటి వారు క్యాడర్ అని అంతా అంటారు. కానీ వారి ఊసు తలవడం లేదు. వైసీపీలో అయితే పదేళ్ళ పాటు కష్టపడినా కూడా అధికారంలోకి వచ్చాక అసలు పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో ఈసారి మాత్రం వారికే అగ్ర తాంబూలం అని చెబుతున్నారు. మరి కార్యకర్తల మనసును నాయకులు ఏ మేరకు గెలుచుకోగలరు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.