ఇది ఫస్ట్.. ఇక నుంచి జగన్‌కు సినిమానే ..!
ఈ క్రమంలో ప్రమాదం కేసును జగన్‌పై పెట్టడం ద్వారాప్రజల్లో వచ్చే స్పందనను కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
By: Tupaki Desk | 24 Jun 2025 6:00 AM ISTవైసీపీ అధినేత జగన్‌పై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు. ఇది పార్టీ అధినేతగా కంటే కూడా.. ఒక రాష్ట్ర మా జీ ముఖ్యమంత్రిగా ఆయనకు పెద్ద ఎఫెక్ట్. గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకు న్న దరిమిలా..ఏడాది తర్వాతజగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ముందుకు సాగారు. ఈక్రమం లోనే పోలీసుల అనుమతికి మించి వాహనాలతో వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సింగమయ్య అనే కార్యకర్త కాన్వాయ్ కింద పడిమరణించారన్నది పోలీసులు చెబుతున్న మాట.
దీనిపై తాజాగా మాజీ సీఎం హోదాలో జగన్‌పై కేసు పెట్టారు. ఆయనను ఏ2గా పేర్కొన్నారు. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు అయితే ఉండొచ్చు. కానీ, కేసు కేసే కదా! కాబట్టి మాజీ సీఎంగా జగన్ ఏ2 నిందితుడిగా చేరారు. ఇదిలావుంటే.. ఈ కేసులు ఇప్పట్లో ముగిసేలా లేవన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఎందుకంటే.. అనేక కేసులు తరుముతున్నాయి. అయితే.. వాటిని పెట్టాలా? వద్దా.? న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలా? అనే విషయాలపై ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ క్రమంలో ప్రమాదం కేసును జగన్‌పై పెట్టడం ద్వారాప్రజల్లో వచ్చే స్పందనను కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే.. కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడా లేకపోగా.. జగన్‌పై కేసు పెట్టడం సబబేనన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. అంటే.. జగన్‌పై కేసులు పెట్టినా.. సింపతీ అయితే దక్కే పరిస్థితి లేదన్నది స్పస్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు మున్ముందు సినిమా కనిపిస్తుందన్న చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణలో మద్యం కుంభకోణం కేసు.. దూకుడుగా ముందుకు సాగుతుందని అంటున్నారు. ఈ కేసులో 3200 కోట్ల మేరకు నిధులు దారి మళ్లాయని అంటున్నారు. ఇక, విద్యార్థులు ఇచ్చిన జగనన్న కిట్లలోనూ అవినీతి జరిగిందని ఇటీవల నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. అదేవిధంగా ఆర్థికంగా అవకతవకలకు పాల్పడడంపై నా విచారణ జరుగుతోంది. మరోవైపు.. ఇసుక అక్రమాలపై నా సర్కారు ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరిన్ని కేసులు నమోదు కావడం ఖాయమన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
