సభా సమరం: కూటమి సర్కారు గేమ్ స్టార్ట్ చేసిందా..!
అంటే.. వైసీపీని ఆటపట్టించేం దుకు.. ఉడికించేందుకు కూడా.. ఈ సభను తమకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంది.
By: Tupaki Desk | 22 July 2024 10:47 AM ISTకూటమి సర్కారు గేమ్ స్టార్ట్ చేస్తుందా? సభలో వైసీపీకి చుక్కలు చూపిస్తుందా? ఇదీ.. ఇప్పుడు జరుగు తున్న చర్చ. ఎందుకంటే.. సభలో వైసీపీకి ఉన్న బలం కేవలం 11 మంది సభ్యులు మాత్రమే. ఈ నేప థ్యంలో వైసీపీకి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఈ క్రమంలోనే కూటమి పార్టీల నాయకులు.. ఈ సమయా న్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే.. వైసీపీని ఆటపట్టించేం దుకు.. ఉడికించేందుకు కూడా.. ఈ సభను తమకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంది.
ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చే విషయంపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇకపై తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. సోమవారం నుంచి సభ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో వైసీపీకి ఇచ్చే ఉద్దేశం ఉంటే..ఇ ప్పటికే ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చి ఉండాలి. కానీ, అలా జరగలేదు. సో.. ఇదొక మైండ్ గేమ్. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే లేఖ రాశారు. అయినా.. దీనిపై స్పందించలేదు. సో.. ప్రధాన ప్రతిపక్షం లేనట్టే!.
ఇక, సభలో కీలకమైన వ్యవహారాలను గమనిస్తే.. తొలిరెండు రోజులు కూడా శ్వేత పత్రాలపై చర్చ నడు స్తుంది. అంటే.. ఇటీవల ప్రవేశ పెట్టిన విద్యుత్, పోలవరం, అమరావతి, మౌలిక సదుపాయాలు వంటి శ్వేతపత్రాలపై సభలో తొలి రెండు రోజులు చర్చ చేపట్టనున్నారు. తద్వారా.. వైసీపీని ఇరుకున పెట్టేందుకు.. కూర్చోబెట్టి.. విమర్శలు చేసేందుకు కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.
మరో ముఖ్య విషయం.. వైసీపీ నాయకులు కనుక సభకు వస్తే.. వారు మాట్లాడేందుకు ఇచ్చే సమయంలో వ్యవహరించే తీరు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం హోదా లేదు కాబట్టి.. సమయం కూడా అలానే ఇస్తారు. అంటే.. ఉదాహరణకు 10 నిమిషాల పాటు సభ జరిగిందని అనుకుంటే.. 8 నిమిషాలకు పైగా.. సమయాన్ని టీడీపీ మిత్రపక్షాలే తీసుకుంటాయి. మిగిలిన ఒక నిమిషం.. లేదా ఒకటిన్నర నిమిషం మాత్రమే వైసీపీకి ఇస్తారు. అంటే.. అప్పటి వరకు వైసీపీ నాయకులు ఎదురు చూడాలి. ఈసడింపులు.. అవమానాలు కూడా భరించాలి.
