Begin typing your search above and press return to search.

పవన్ ని తిట్టడం అవసరమా...!?

ఈ మ్యారేజీ స్టార్ అడ్వాళ్ళను కేవలం ఆట వస్తువుగా చూస్తూ పెళ్ళి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతున్నారని జగన్ తీవ్ర విమర్శలే చేశారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:30 PM GMT
పవన్ ని తిట్టడం అవసరమా...!?
X

పవన్ కళ్యాణ్ జనసేన ఇపుడు పొత్తుల ఎత్తులతో సతమతం అవుతున్న సందర్భం. ఎన్ని సీట్లు టీడీపీ ఆ పార్టీకి ఇస్తుందో తెలియదు. ఇలాగ టీడీపీ కూడా ఇబ్బంది పడుతున్న నేపధ్యం ఉంది. ఈ పరిస్థితులలో జనసేన అధినేత మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా అందులో ఏమైనా వ్యూహం ఉంటుందా అన్నది చర్చకు వస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద మళ్లీ వ్యక్తిగత విమర్శలు చేశారు. భీమవరంలో జరిగిన సభలో ఆయన మూడు పెళ్ళిళ్ల అంశం గురించి మాట్లాడారు. పవన్ ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగేళ్ల అపటు కాపురం చేసి ఉండరని జగన్ అంటున్నారు. ఈ మ్యారేజీ స్టార్ అడ్వాళ్ళను కేవలం ఆట వస్తువుగా చూస్తూ పెళ్ళి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతున్నారని జగన్ తీవ్ర విమర్శలే చేశారు.

నాలుగేళ్ళకు ఒకసారి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తరువాత విడాకులు ఇవ్వడం పవన్ కి అలవాటు అయిన వ్యవహారంగా ఉందని జగన్ విమర్శించారు. కార్లను మార్చినట్లుగా భార్యలను పవన్ మారుస్తారని కూడా జగన్ నిందించారు. ఇలంటి వాళ్ళు నాయకులు అయితే మిగతా వాళ్లు కూడా ఈయన లాగానే మూడేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారని అపుడు మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అని జగన్ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే పవన్ గురించి ఈ సమయంలో ఇలా మాట్లాడడం వల్ల వైసీపీకి వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏమీ ఉండదని అంటున్నారు. దీని వల్ల పవన్ కే సోషల్ మీడియాలో రీచ్ పెరిగి హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. ఇక టీడీపీని లోకేష్ ని గట్టిగా టార్గెట్ చేయాల్సిన వేళ పవన్ ని చేసి లాభం ఏంటి అని మీడియా విశ్లేషకుల నుంచి వస్తున్న మాట.

మరో వైపు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని చంద్రబాబు బెంగళూరు లో కలిశారు. దాని మీద బాబుని టార్గెట్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. అలా చేయడం వల్లనే పొలిటికల్ గా వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందని అంటున్నారు. అలా ఏపీలో ప్రతీ పార్టీతో పొత్తు టీడీపీ పెట్టుకుంటుందని ఆఖరుకు కాంగ్రెస్ తో పొత్తుకు సైతం రెడీ అవుతోందని జగన్ గట్టిగా టార్గెట్ చేస్తే టీడీపీకి డైరెక్ట్ గా అటాక్ అయ్యేదని అంటున్నారు.

అలా కాకుండా పవన్ని పదే పదే విమర్శిస్తే ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు. దాని వల్ల వైసీపీకి వచ్చే కాపు ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. నిజానికి పవన్ కంటే టీడీపీనే టార్గెట్ చేయడం వైసీపీకి మేలు అంటున్నారు. ఏరకంగా చూసినా ప్రధాన ప్రత్యర్ధిగా టీడీపీయే వైసీపీకి ఉంది.

కూటమి కట్టినా మేజర్ పార్టీ టీడీపీయే. రేపటి రోజున సీఎం అవాలనుకుంటున్నది కూడా చంద్రబాబే. దాంతో ఆ పార్టీని విమర్శించడం వల్లనే వైసీపీ పొలిటికల్ గా అడ్వాంటేజ్ ని తీసుకోగలుగుతుంది అని అంటున్నారు. మరి జగన్ ఉద్దేశ్యాలు వ్యూహాలు ఏమిటి అన్నది తెలియడం లేదు కానీ పవన్ ని టార్గెట్ చేయడం మాత్రం వైసీపీకి అంతగా మేలు చేయదనే అంటున్నారు.