Begin typing your search above and press return to search.

బీజేపీది బ్లాక్ మెయిలేనా ?

అలాంటపుడు తిరుపతి అభివృద్ధికి టీటీడీ 1 శాతం నిధులను ఖర్చులు చేస్తే తప్పేముంది ? చేసే ఖర్చులు కూడా ప్రతిరోజు తిరుపతికి వచ్చే లక్షలాదిమంది భక్తుల సౌకర్యం కోసమే కదా.

By:  Tupaki Desk   |   12 Oct 2023 7:20 AM GMT
బీజేపీది బ్లాక్ మెయిలేనా ?
X

మతాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ నేతలు బాగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉన్నారు. ఇపుడు విషయం ఏమిటంటే తిరుపతి అభివృద్ధికి టీటీపీ నిధులను 1 శాతం ఖర్చుచేయాలని పాలకమండలి నిర్ణయించింది. దీనిపై బీజేపీ నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సాధినేని యామినీ శర్మ తదితరులు నానా రచ్చచేస్తున్నారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయటం ఏమిటని బీజేపీ నేతలు పెద్ద రాద్దాంతం మొదలుపెట్టారు. తాజా నిర్ణయంపై కోర్టులో కేసులు వేస్తామని బెదిరిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్ధానం అనే పేరులోనే తిరుపతి ఉందన్న విషయాన్ని మరచిపోయారు. తిరుపతి లేకపోతే తిరుమల లేదని అందరికీ తెలిసిందే. తిరుపతి-తిరుమల ఒకదానిపై మరొకటి ఆధారపడిన ఆలయ క్షేత్రాలు. తిరుపతి మీదుగానే భక్తులు తిరుమలకు వెళ్ళాలి. తిరుపతిలో ఉండే దేవాలయాలు, సత్రాలు, ఆఫీసుల్లో చాలావరకు టీటీడీవే అని అందరికీ తెలిసిందే. టీటీడీ ఉద్యోగులే సుమారు 20 వేలమంది తిరుపతిలో ఉంటున్నారు.

అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమంటే తిరుపతి-తిరుమల వేర్వేరు కాదని. అలాంటపుడు తిరుపతి అభివృద్ధికి టీటీడీ 1 శాతం నిధులను ఖర్చులు చేస్తే తప్పేముంది ? చేసే ఖర్చులు కూడా ప్రతిరోజు తిరుపతికి వచ్చే లక్షలాదిమంది భక్తుల సౌకర్యం కోసమే కదా. శానిటేషన్ మీద టీటీడీ ఎక్కువగా దృష్టిపెట్టబోతోంది. విస్తృత ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయం చాలా మంచిదే కదా. ఇందులో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ?

ఇక్కడ విషయం ఏమిటంటే తిరుపతి అభవృద్ధి విషయంలో టీటీడీ భాగస్వామ్యం అవ్వాలని చంద్రబాబునాయుడు హయాంలో నియమించిన పాలకవర్గమే నిర్ణయం తీసుకుంది. అందులో భాను కూడా సభ్యుడే. అప్పట్లో పాలకమండలి నిర్ణయానికి ఆమోదం తెలిపిన భాను ఇపుడు అడ్డం తిరగటమే. దాంతోనే ఇది ఫక్తు బ్లాక్ మెయిల్ తప్ప మరోటికాదని అందరికీ అర్ధమైపోతోంది. టీటీడీ గురించి ఏమీ తెలీని యామినీ శర్మ లాంటి వాళ్ళు కూడా టీటీడీ బైలా అని చట్టమని ఏదేదో మాట్లాడేస్తున్నారు.