Begin typing your search above and press return to search.

బాబు సైలెంట్ గా ఉండడం ఆ పార్టీకే లాభమా...?

ఇదిలా ఉంటే నంద్యాల నుంచి విజయవాడ సీఐడీ ఆఫీసుకు బాబుని సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 9న తీసుకుని వచ్చినపుడు పెద్దగా జనాలలో స్పందన లేదని ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 9:32 AM GMT
బాబు సైలెంట్ గా ఉండడం ఆ పార్టీకే లాభమా...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ప్రతికూలతలు కూడా కొన్ని అనుకూలతలుగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. దాంతోనే బాబు ఎపుడూ ఒక్క మాట అంటూ ఉంటారు. తాను సంక్షోభాలను సవాల్ గా తీసుకుని ముందుకు సాగుతాను అని. ఇదిలా ఉంటే 52 రోజుల పాటు బాబు జైలులో మగ్గిపోయారు.

దాంతో ఆయనకు జనం నీరాజనం పలికారు. ఏకంగా రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్లడానికి రెండు గంటలు అనుకుంటే పద్నాలుగు గంటలు పట్టింది. ఇది మహా అద్భుతం అని ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారు. అర్ధరాత్రి తెల్లవారు జాము అని కూడా చూడకుండా జనాలు అంతా రోడ్ల మీదకు వచ్చి మరీ బాబుకు స్వాగతం పలికారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే నంద్యాల నుంచి విజయవాడ సీఐడీ ఆఫీసుకు బాబుని సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 9న తీసుకుని వచ్చినపుడు పెద్దగా జనాలలో స్పందన లేదని ప్రచారం సాగింది. మొత్తం రోడ్డు మార్గం గుండా కారులో బాబు వచ్చినా అది పగలు సమయం అయినా అనుకున్నట్లుగా ఎలాంటి రియాక్షన్ అయితే జనాలలో రాలేదని కూడా వార్తలూ వచ్చాయి.

మరి బాబు అపుడూ ఇపుడూ రెండు సార్లూ కారులోనే విజయవాడకు వచ్చారు. కానీ ఒకసారి పెద్దగా స్పందన లేదు, మరోసారి జన సందోహం కనిపించింది. దానికి కారణం ఏంటి అంటే బాబు జైలు గోడల మధ్య చాన్నాళ్ళు ఉన్నారన్న సానుభూతితో పాటు బాబుని చూసి చాలా కాలం అయింది అన్న మరో రకమైన ఆసక్తి కూడా జనంలో ఉంది అని అంటున్నారు.

నిజానికి రాజకీయాల్లో ఎపుడు జనంలో ఉండాలో ఎంత సేపు ఉండాలో కూడా ఒక వ్యూహం గా ఉంటుంది. కానీ చంద్రబాబు బలహీనత అయితే నిరంతరం జనంలో ఉండడం, అదే ఆయనకు ఇప్పటిదాకా ప్లస్సూ మైనస్సూ అవుతూ వస్తోంది. అయితే బాబు జనంలో ఉండడం వల్ల దాని కంటే ఆయన తెర వెనక ఉన్నపుడే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తోంది. అది ప్రాక్టికల్ గా కూడా ఇపుడు ప్రూవ్ అయింది.

నిజానికి ఈ రకమైన స్ట్రాటజీని జగన్ వాడుతారు. ఆయన పాదయాత్ర టైం లో తప్ప ఎపుడు జనంలోకి వచ్చినా కొంత గ్యాప్ అంటూ మెయింటెయిన్ చేసేవారు. దాని వల్ల తమ అభిమాన నేతను చూడాలన్న ఆసక్తి అటు క్యాడర్ తో పాటు ఇటు జనంలోనూ ఉంటుంది. అదే విధంగా సమస్యలు కూడా కొత్తగా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం అధికార పార్టీని తిడుతూ రొడ్డకొట్టుడు రొటీన్ స్పీచ్ ఇస్తే మాత్రం అదే రివర్స్ కొడుతుంది అని అంటున్నారు.

బహుశా చంద్రబాబుకు ఈ జైలు జీవితం ఈ కోర్టు ఆదేశాలు ఆంక్షలు లేకపోయి ఉంటే ఈపాటికి ఇంకా ఏపీలో ఆ మూల నుంచి ఈ మూల దాకా తిరుగుతూ ఉండేవారే. ఇపుడు ఆయన ఇంటికీ ఆసుపత్రికే పరిమితం కావాల్సి రావడం వల్ల టీడీపీకే ప్లస్ అని అంటున్నారు. ఆయన పార్టీకి డైరెక్షన్ ఇచ్చి తాను కీలక టైం లో జనంలోకి వచ్చే వీలుతుంది అని అంటున్నారు.

బాబుని చూసేందుకే ఇపుడు జనం క్యూ కట్టారు. అపుడు బాబు స్పీచ్ లను వినేందుకు ఇంకా ఆసక్తిని కనబరుస్తారు అని అంటున్నారు. అలా ఎన్నికల హీట్ పెరిగిన వేళ బాబు జనంలోకి వస్తేనే బాగుంటుది అన్నది టీడీపీలోనూ చర్చగా ఉందిట. మొత్తానికి బాబు సైలెన్స్ గా ఉండడంలోనూ వ్యూహం ఉంది అనే అంటున్నారు. చూడాలి మరి బాబు జనంలోకి ఎపుడు వస్తారు, ఈ బెయిల్ జెయిల్ వ్యవహారానికి లాజికల్ ఎండ్ కార్డు ఎపుడు పడుతుంది అన్నది.