పగటి దాడులు చేయకుండా రాత్రిళ్లే చేస్తున్న పాక్
కొన్ని వ్యూహాత్మక టార్గెట్లను పెట్టుకున్న పాక్ ఆత్మాహుతి డ్రోన్లను భారత్ మీద దాడులు చేసేందుకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 10 May 2025 9:49 AM ISTతాజాగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి పాకిస్తాన్ కుట్రపూరిత ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఉదయం పూట సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటం.. కాల్పులు చేపట్టటం లాంటివి చేస్తున్నాయి. మరోవైపు రాత్రి అయితే చాలు.. ఆత్మాహుతి డ్రోన్లు.. వైమానిక దాడులకు తెగబడుతున్న పాక్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఎప్పటికప్పుడు పాక్ చేపట్టే డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పి కొట్టటమే కాదు.. దానికి బలమైన గుణపాఠాన్ని చెబుతున్న పరిస్థితి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. భారత్ ను కవ్వించే పనులకు తెగపబడుతోంది. గురువారం రాత్రి విషయానికే వస్తే.. రాత్రి వేళలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ధర్మశాలను పాక్ టార్గెట్ చేయటం తెలిసిందే. రాత్రిళ్లు.. చిమ్మచీకట్లో దాడులకు తెగబడటం ద్వారా భారత్ ను దొంగ దెబ్బ తీయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
అయితే..పాక్ కుయుక్తులకు భారత సైన్యం ధీటైన సమాధానాన్ని ఇస్తోంది. కొన్ని వ్యూహాత్మక టార్గెట్లను పెట్టుకున్న పాక్ ఆత్మాహుతి డ్రోన్లను భారత్ మీద దాడులు చేసేందుకు వస్తున్నాయి. వీటిని ముందుగానే గుర్తించి.. నిర్మూలిస్తున్నారు. దీంతో.. పాక్ ఎత్తులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళలో.. పగటి పూట కంటే రాత్రిళ్లు దాడులు చేయటం ద్వారా.. భారత్ ను దెబ్బ తీయాలన్న ఎత్తుగడను ప్రదర్శిస్తోంది పాక్.
అయితే.. ఈ తప్పుడు పనులకు భారత్ బలంగా తిప్పి కొట్టటమే కాదు.. పాక్ లోని కొన్ని ప్రాంతాల్ని టార్గెట్ చేస్తోంది. గురువారం రాత్రి మాదిరే.. శుక్రవారం సైతం రాత్రి వేళలోనే దాడులకు తెగబడటం చూస్తుంటే.. రానున్న రోజుల్లోనూ ఈ ఉద్రిక్తతలను ఇలానే కంటిన్యూ చేయాలన్నది పాక్ దుర్మార్గ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే.. వారెంత భారీగా ఆయుధాలు వాడుతున్నా.. అంతకు రెట్టింపు శక్తివంతమైన ఆయుధాల్ని ఉపయోగిస్తున్న భారత్.. దాయాది రాత్రి దాడుల్ని సమర్థంగా తిప్పి కొడుతోంది. మొత్తంగా చూస్తే.. ఈసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లో భారత్ ఏం చేసినా చెప్పి మరీ చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం కపట నాటకాలకు పాల్పడుతూ దొంగ దెబ్బ కొట్టాలన్నట్లుగా దాని తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
