Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి 1:28కి ఆర్మీ వీడియో... ఏమిటీ 'ఆపరేషన్ సిందూర్'?

అవును... పాక్ పై భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా చేపట్టింది.

By:  Tupaki Desk   |   7 May 2025 9:47 AM IST
అర్ధరాత్రి 1:28కి ఆర్మీ వీడియో... ఏమిటీ ఆపరేషన్  సిందూర్?
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ప్రతీకారంతో భారత్ రగిలిపోతుంది. ఈ సమయంలో సరిగ్గా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్ పై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా.. తొమ్మిది ఉగ్రస్థావారాలపై "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది.

అవును... పాక్ పై భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా చేపట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా ఉగ్రశిభిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన ఖచ్చితమైన దాడుల్లో 80 మందిపైగా ఉగ్రవాదులు మరణించారని ఉన్నత భద్రతా వర్గాలు తెలిపాయి. దీంతో.. పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!

జాతీయ మీడియా కథనాల ప్రకారం... బహవల్పూర్, మురిద్కేలలో రెండు అతిపెద్ద దాడులు జరిగాయి. ఈ సమయంలో ఈ రెండు ప్రదేశాల్లోనూ సుమారు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు మరణించారు. మురిద్కే లక్ష్యంగా సైధాంతిక ప్రధాన కార్యాలయం అయిన మసీదు వా మర్కజ్ తైబా ఉంది. ఇది చాలా కాలంగా 'పాకిస్థాన్ ఉగ్రవాద నర్సరీ' గా పరిగణించబడుతుంది.

మంగళవారం అర్ధరాత్రి సరిగ్గా 1:44 గంటలకు "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు ఈ దాడిని సంఉయుక్తంగా నిర్వహించాయి. మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి.

ఈ దాడులకు కొద్దిసేపటి ముందు (రాత్రి 1:28 గంటలకు) ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం అని ఆర్మీ పేర్కొంది. ఉగ్ర శిబిరాలపై భారత సాయుధ దళాల దాడుల వేళ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో కింద భారత్ మాతాకీ జై అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.

కాగా... ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడున్న జంటల్లో పురుషులను వారి మతం అడిగి మరీ కాల్చి చంపారు. మృతుల్లో కొత్తగా పెళ్లైనవారు ఉన్నారు. ఈ క్రమంలో టెర్రరిస్టులు వినయ్ నర్వాల్ ను హత్యచేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి ఫోటో దేశం మొత్తాన్ని కుదిపేసింది.

ఆ వినయ్ నర్వాల్ నేవీ అధికారి కూడా. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్ధం ఈ ఆపరేషన్ లో దాగి ఉందని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ను ప్రధాని మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.