ఆపరేషన్ సిందూర్: పాక్ కుట్ర తుత్తునియలు.. స్వర్ణ దేవాలయం సురక్షితం
ఈ క్రమంలో పాకిస్థాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న పవిత్ర స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్)ను లక్ష్యంగా చేసుకుందని భారత ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు.
By: Tupaki Desk | 19 May 2025 3:23 PM ISTభారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను జీర్ణించుకోలేని పాకిస్థాన్, ప్రతీకారేచ్ఛతో భారతదేశంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న పవిత్ర స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్)ను లక్ష్యంగా చేసుకుందని భారత ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు. అయితే, భారత సైన్యం పాకిస్థాన్ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టి, స్వర్ణ దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రక్షించిందని ఆయన తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ భారత్‌పై ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని భారత సైన్యం ముందుగానే అంచనా వేసింది. ఈ దాడుల్లో సైనిక స్థావారాలతో పాటు పౌర సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలు లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఊహించింది. ఈ నేపథ్యంలోనే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై ప్రత్యేక నిఘా ఉంచి, అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించింది. మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి మాట్లాడుతూ, "పాక్ సైన్యానికి ఎలాంటి కచ్చితమైన సైనిక లక్ష్యాలు లేవని మాకు తెలుసు. అందుకే వారు పౌర ప్రాంతాలను, ముఖ్యంగా గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని మేము ముందుగానే ఊహించాం. దానికి అనుగుణంగానే అదనపు రక్షణ కల్పించి, పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని పేర్కొన్నారు.
మే 8 తెల్లవారుజామున పాకిస్థాన్ స్వర్ణ దేవాలయం లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే, అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు పాకిస్థాన్ పన్నాగాన్ని భగ్నం చేశారు. అత్యాధునిక ఎస్-400, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో సహా భారత గగనతల రక్షణ వ్యవస్థలు పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను గగనతలంలోనే కూల్చివేశాయి. దీంతో స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా భారత సైన్యం ఆ మహా పవిత్ర మందిరాన్ని కాపాడింది.
'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా భారత సైన్యం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మే 7న మెరుపుదాడి చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను భారత్‌పైకి ప్రయోగించింది. భారత సైన్యం పశ్చిమ కమాండ్ కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సైన్యం సన్నద్ధత, ధైర్యసాహసాలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచిం