Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీతో భేటీ కావాలంటే.. ఈ టెస్ట్ తప్పనిసరి!

దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోడీని కలిసే మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2025 2:50 PM IST
ప్రధాని మోడీతో భేటీ కావాలంటే.. ఈ టెస్ట్ తప్పనిసరి!
X

దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. దీంతో.. ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు రెగ్యులర్ గా అందిస్తోంది. ఈ సమయంలో మోడీని కలిసేవారంతా తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనే రూల్ తెరపైకి వచ్చింది.

అవును... దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోడీని కలిసే మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో.. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,121 కు చేరింది. ఇదే సమయంలో దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగా... బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం మృతుల సంఖ్య 74కు పెరిగింది.

ఈ క్రమంలో కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్‌ కేసులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో గుజరాత్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... ఏపీలో 72, తెలంగాణలో 11 కేసులు ఉన్నాయి.

ఇక రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కేరళ - 2,223

గుజరాత్‌ - 1,223

ఢిల్లీ - 757

వెస్ట్ బెంగాల్ - 747

మహారాష్ట్ర - 615

కర్ణాటక - 459

ఉత్తర ప్రదేశ్‌ - 229

తమిళనాడు - 204

రాజస్థాన్‌ - 138

హర్యానా - 125

ఆంధ్రప్రదేశ్‌ - 72

మధ్యప్రదేశ్‌ - 65

మహారాష్ట్ర - 615

ఛత్తీస్‌ గఢ్‌ - 48

బిహార్‌ - 47

ఒడిశా - 41

సిక్కిం - 33

పంజాబ్‌ - 33

తెలంగాణ - 11

పుదుచ్చేరి - 10

ఝార్ఖండ్‌ - 10

జమ్మూకశ్మీర్‌ - 9

అస్సాం - 6

గోవాల్లో - 6

చండీగఢ్‌ - 3

ఉత్తరాఖండ్‌ - 3

హిమాచల్‌ ప్రదేశ్‌ - 2

మణిపుర్‌ - 1

త్రిపుర - 1