ఉద్యోగం చేస్తూనే AI నిపుణులు అవ్వండి.. ఐఐటీ మద్రాస్ స్పెషల్ కోర్సు!
ఐఐటీ మద్రాస్ కేవలం AI మాత్రమే కాకుండా, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా వెబ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
By: Tupaki Desk | 28 April 2025 7:30 PMఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే అవకాశాలకు కొదవ ఉండదు. కానీ, ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేని వారికి AI నేర్చుకోవడం ఎలా? మీ ఈ ప్రశ్నకు సమాధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ సరికొత్త మార్గాన్ని చూపించింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ ఎంటెక్ (Web Mtech) ప్రోగ్రామ్‌ను AIలో అందిస్తోంది. ఇకపై మీ ఉద్యోగానికి ఆటంకం కాకుండానే.. ప్రపంచాన్ని మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ టెక్నాలజీని సొంతం చేసుకోవచ్చు. ఈ స్పెషల్ కోర్సులో చేరేంుదకు మే 31 వరకు మాత్రమే అవకాశం ఉంది.
వివిధ స్పెషలైజేషన్లలో కోర్సులు
ఐఐటీ మద్రాస్ కేవలం AI మాత్రమే కాకుండా, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా వెబ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. అవి: ఏరో స్పేస్ ఇంజినీరింగ్ (ఏరో స్పేస్, అమ్యునిషన్ టెక్నాలజీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్; కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మల్టీ మీడియా, మైక్రో ఎలక్ట్రానిక్స్), మెకానికల్ ఇంజినీరింగ్ (మెకానికల్ డిజైన్, ఆటోమోటివ్ టెక్నాలజీ), ఈ-మొబిలిటీ
ఎవరు అర్హులు?
ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి అభ్యర్థులు వారు ఎంచుకున్న స్పెషలైజేషన్ కోర్సుకు సంబంధించిన విద్యా నేపథ్యంతో పాటు కనీసం రెండేళ్ల వర్క్ ఎక్సపీరియన్స్ కలిగి ఉండాలి. సీట్ల భర్తీ కోసం సంబంధిత అంశాలపై క్వాలిఫయర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగులు తమ కెరీర్లో మరింత రాణించడానికి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎంట్రెన్స్ సిలబస్, దరఖాస్తు ఫీజు, ప్రోగ్రామ్ స్ట్రక్చర్, కోర్సు వ్యవధి, ఫీజు, ఇతర పూర్తి వివరాలను ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
గతంలో ఐఐటీ మద్రాస్ ఇండస్ట్రియల్ AIలో వెబ్ ఎంటెక్ కోర్సును అందించింది. అయితే, ప్రస్తుత మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రోగ్రామ్‌ను మరింత సమగ్రంగా, విస్తృతంగా రూపొందించి, వెబ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Web M.Tech in Artificial Intelligence) పేరుతో కొత్తగా ప్రారంభించింది.
ఈ కోర్సును సాయంత్రం లేదా వారాంతపు లైవ్ వర్చువల్ క్లాసెస్ కు హాజరు కావడం ద్వారా లేదా రికార్డ్ చేసిన సెషన్లను చూడడం ద్వారా పూర్తి చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకున్న వారికి ల్యాబ్‌లు, ప్రాజెక్ట్‌ల ద్వారా విస్తృతమైన ప్రాక్టికల్ అనుభవం లభిస్తుంది. ఈ వెబ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడం ద్వారా ఐఐటీ మద్రాస్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందవచ్చు.
ఐఐటీ మద్రాస్ అందిస్తున్న ఈ 11 ప్రోగ్రామ్‌లకు ఇప్పటివరకు 1350 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 850 మందికి పైగా వివిధ కోర్సులను అభ్యసిస్తుండగా, 350 మందికి పైగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.