ఆ పార్టీదే అధికారం అంటూ ఐబీ సర్వే .. నిజమేనా...!?
ఈ సర్వే ప్రకారం వైసీపీ గెలిచినట్లే అని ఆ పార్టీ వారు ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు అన్నది మిగిలిన వారి మాట
By: Tupaki Desk | 11 April 2024 9:21 AM ISTఏపీలో ప్రస్తుతం లోకల్ నుంచి నేషనల్ వరకూ ఎన్నో సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో ఏ సర్వే నిజం. ఏది గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని పట్టుకుంది అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే సర్వేలు అంటే సర్వేశ్వరులు కాదు. వారికి ఉన్న అంచనాలను మాత్రమే చెబుతారు.
పైగా పెయిడ్ సర్వేలు కూడా చాలా జరిపిస్తున్నారు అని అంటున్నారు. దాంతో చూసుకుంటే కనుక ఏ పార్టీ పాట అలాంటి సర్వేలు పాడుతూ ఉంటాయి. ఏపీలో సర్వేలు చూస్తే వైసీపీ గెలుస్తుందని కొన్ని చెబుతున్నాయి, మరికొన్ని టీడీపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. కానీ ఇపుడు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ అన్నట్లుగా ఐబీ సర్వే వెలుగుచూస్తోంది.
కేంద్ర ఇంటలిజెన్స్ సర్వే అని ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ సర్వేలో చూస్తే ఏపీలో వైసీపీకి 51 శాతం ఓటు షేర్ తో 124 సీట్లు, అలాగే టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ తో 51 సీట్లు రావచ్చు అని ఈ సర్వే పేర్కొంది. ఇది ఇంటలిజెన్స్ బ్యూరో సర్వే అవునా కాదా అన్నది ఎవరికీ తెలియదు కానీ తెగ సర్క్యులేట్ చేస్తున్నారు
ఈ సర్వే ప్రకారం వైసీపీ గెలిచినట్లే అని ఆ పార్టీ వారు ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు అన్నది మిగిలిన వారి మాట. ఏపీలో చూస్తే హోరా హోరీ పోరు సాగుతోంది అని అంటున్నారు. కానీ సెంట్రల్ ఐబీ సర్వే మాత్రం మొగ్గు వైసీపీకే అని చెబుతోంది.
దీని మీద ఇపుడు రకరకాలైన చర్చలు విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. ఏపీకి బీజేపీ పెద్దలు కేంద్ర స్థాయి నేతలు పెద్దగా రాకపోవడానికి ఈ సర్వే నివేదికలు వారి వద్ద ఉండడమే అని అంటున్నారు. ఈ సర్వే నివేదికలు చూసిన మీదటనే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆ పార్టీ మీద కోరి విమర్శలు చేయడం ఎందుకు అన్నది కూడా బీజేపీ పెద్దల మనోగతంగా ఉంది అని అంటున్నారుట. ఏది ఏమైనా సెంట్రల్ ఐబీ పేరుతో వచ్చిన ఈ సర్వే కలకలం రేపుతోంది.
