Begin typing your search above and press return to search.

భాగ్య‌న‌గ‌రం సిగ‌లో మ‌రో మ‌ణిహారం.. ప్ర‌పంచ కీర్తి!

మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌, చంద్ర‌బాబుల హ‌యాంలో ఒక రేంజ్‌కు హైద‌రాబాద్‌కు చేరింది.

By:  Tupaki Desk   |   13 April 2024 12:30 AM GMT
భాగ్య‌న‌గ‌రం సిగ‌లో మ‌రో మ‌ణిహారం.. ప్ర‌పంచ కీర్తి!
X

భాగ్య‌న‌గ‌రంగా కీర్తి పొందిన తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌కు మ‌రో కీర్తి సొంత‌మైంది. ముస్లిం పాల‌కుల నుంచి నేటి వ‌రకు అనేక మంది ఈ న‌గ‌రాన్ని అభివృద్ది చేశారు. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌, చంద్ర‌బాబుల హ‌యాంలో ఒక రేంజ్‌కు హైద‌రాబాద్‌కు చేరింది. ఇక‌, కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ న‌గ‌రాభివృద్దికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని రాజ‌కీయాల‌కు అతీతంగా అందరూ చెప్పే మాటే.

ఇలాంటి న‌గ‌రానికి అనేక అవార్డులు, రివార్డులు కూడా వ‌చ్చాయి. స్వ‌చ్ఛ‌త‌లో అయితే.. కేంద్రం రెండు సార్లు జాతీయ అవార్డులు ప్ర‌క‌టించింది. గ‌త ప‌దేళ్లుగా ప్ర‌శాంత‌త‌కు కేరాఫ్‌గా నిలిచిన న‌గ‌రం కూడా ఇదే. అంత‌కు ముందు పేలుళ్ల కేసులు జ‌రిగినా.. త‌ర్వాత కేసీఆర్ వ‌చ్చాక‌.. తీసుకున్న నిర్ణ‌యాలతో న‌గ‌రం స్వ‌రూపం మారిపోయింది. ఇక‌, రేవంత్ రెడ్డి సీఎం అయిన త‌ర్వాత‌... కూడా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుని న‌గ‌రాన్ని అభివృద్ది చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు భాగ్య‌న‌గ‌రం పేరు ప్ర‌పంచ స్థాయిలో వినిపిస్తోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భాగ్య‌న‌గ‌రం చోటుద‌క్కించుకుంది. అది కూడా.. తొలి 10 స్థానాల్లో(4వ ప్లేస్‌) కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని `నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్`` వెలువ‌రించాయి. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024`(స్థిరాస్తి వ్యాపారం: ఒక ద‌శాబ్దం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు) పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇదీ జాబితా

1వ స్థానం - సూర‌త్‌(వ‌జ్రాల వ్యాపారాల‌కు ప్ర‌సిద్ధి)

2వ స్థానం - ఆగ్రా(యూపీ... తాజ్‌మ‌హ‌ల్‌)

3వ స్థానం - బెంగ‌ళూరు(ఐటీ)

4వ స్థానం - హైద‌రాబాద్‌(రియ‌ల్ ఎస్టేట్ బూమ్‌)