గుంటూరు, శ్రీకాకుళం .. టీడీపీకి ప్లస్ ..!
గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపి పేరు మార్మోగుతోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు.. చాలా కలిసి వచ్చే అంశాలుగా మరాయి
By: Tupaki Desk | 11 Jun 2025 6:00 AM ISTగుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపి పేరు మార్మోగుతోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు.. చాలా కలిసి వచ్చే అంశాలుగా మరాయి. గుంటూరు నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నారై నాయకుడు.. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం కేంద్రంలో సహాయం మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి వరుసగా విజయాలు సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
ఒకవైపు కేంద్ర మంత్రులుగా ఉంటూ మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో పనులను దూకుడుగా చేస్తుండ డం వీరికి ప్లస్ అయింది. తద్వారా పార్టీలో మెరుగైన పనితీరుకు నిదర్శనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక పార్లమెంటు స్థానాల్లో టిడిపి విజయం సాధించినప్పటికీ ఈ రెండు స్థానాలు మాత్రం అభివృద్ధి లోనూ, అదే విధంగా పార్లమెంటు సభ్యుల పనితీరులోను కూడా మెరుగైన ఫలితాలను అందిస్తోందని చెప్పాలి. కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
నిరంతరం ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. వారానికి రెండు రోజులు పాటు నియోజకవర్గంలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా గుంటూరులోని కీలకమైన అరండల్ పేటలో ఓవర్ బ్రిడ్జి అలాగే ఇతర ప్రాజెక్టులను కూడా ఆయన సీరియస్‌గా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక, గ్రామాల్లోనూ జోరుగా పర్యటిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తద్వారా ప్రజలకు చేరువ అయ్యారనే చెప్పాలి.
ఇక, శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి గానే కాకుండా స్థానిక పార్లమెంటు సభ్యుడుగా కూడా రామ్మోహన్ నాయు డు తనదైన ముద్రను వేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను ఆయన పరిష్క రిస్తున్నారు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు చేరువగా ఉంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలివిడిగా ముందుకు సాగుతూ ఉండడం చెప్పుకోదగ్గ అంశం. దీంతో ఇతర పార్లమెంటు స్థానాలు కన్నా కూడా ఈ రెండు స్థానాల్లో మాత్రం టీడీపీకి తిరుగులేదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ప్రజలకు చెరువుగా ఉంటూ అటువైపు కేంద్రంతోను కలివిడిగా ఉంటూ ఇద్దరు మంత్రులు పనిచేసిన తీరు ప్రశంసలు పొందుతోందనే చెప్పాలి.