టీడీపీ వర్సెస్ జనసేన... గుడివాడలో ఏమి జరిగింది?
ఏపీలో కుటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా జనసేన - టీడీపీ - బీజేపీ సత్తా చాటాయి
By: Tupaki Desk | 19 Aug 2024 12:54 PM ISTఏపీలో కుటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా జనసేన - టీడీపీ - బీజేపీ సత్తా చాటాయి. ఈ సమయంలో చంద్రబాబు, పవన్ లు ఒకే మాటపై ఉన్నట్లు అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అక్కడక్కడా ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య ఐకమత్యం లోపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా గుడివాడలో అందుకు ఓ ఉదాహరణ తెరపైకి వచ్చింది.
అవును... అధికారంలో ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ - జనసేన నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గుడివాడలో ఓ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా నాగవరప్పాడు జంక్షన్ లో జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ సమయంలో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నట్లు తెలుల్స్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు... జాతీయ రహదారిపై ఆందోళనకు దిగేవరకూ వచ్చింది పరిస్థితి. ఈ నేపథ్యంలో... గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలనేది ఆ సమయంలో జనసేన నేత్ల డిమాండ్!
ఈ సందర్భంగా జనసేన దిమ్మెను కూలగొట్టడానికి నరసింహరావు ప్రయత్నించారని.. ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని జనసేన నేతలు నినాదాలు చేశారు. జనసేన దిమ్మెపై దాడిని తమపై దాడిగా భావిస్తున్నామనేది వారి వాదన. ఈ సమయంలో టీడీపీ నేతలు అక్కడికి చేరుకోవడంతో కాస్త తోపులాట జరిగింది.
ఈ సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి జనసేన నాయకులకు సర్ధిచెప్పి అక్కడనుంచి పంపించేశారు! ఈ సమయంలో నరసింహరావుపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇలా టీడీపీ నేతలు జనసేన దిమ్మెను కూలగొట్టడానికి వచ్చిన విషయాన్ని పవన్ కృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు.
కాగా.. టీడీపీకి చెందిన బీసీ నేత దారం నరసింహారావు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు! నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్న నరసింహారావు జనసేన దిమ్మెను ధ్వంసం చేయాలని ప్రయత్నించారంటూ ఆ పార్టీ ఇన్ ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో... పరిస్థితి ఇంటర్నల్ గానే చక్కబడిపోతుందా.. లేదా అనేది వేచి చూడాలి!
