Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్..మధ్యంతర బెయిల్ మంజూరు

అందుకనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇపుడిచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే.

By:  Tupaki Desk   |   31 Oct 2023 5:45 AM GMT
చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్..మధ్యంతర బెయిల్ మంజూరు
X

స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు గ్రేట్ రిలీఫ్ దొరికింది. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటీషన్ను విచారించిన హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పిచ్చింది. నిజానికి ఈ విచారణ సోమవారమే రావాల్సింది. అయితే తీర్పును మంగళవారంకు రిజర్వు చేసింది. ఉదయమే మధ్యంతర బెయిల్ విషయంలో 4 వారాల రిలీఫ్ ఇస్తు తీర్పుచెప్పింది. అలాగే కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కేసులో మెరిట్ ప్రకారం కాకుండా అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ దొరకటం గమనార్హం. చంద్రబాబుకు కంటి సమస్య ఉందని క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. జూలైలో ఎడమకంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. మూడు నెలల్లోపు కుడి కంటికి కూడా ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ మూడునెలల సమయం అయిపోయింది.

డాక్టర్ల రిపోర్టును చంద్రబాబు లాయర్లు హైకోర్టు ముందుంచారు. ఈ విషయంలో సీఐడీ లాయర్లు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పినట్లు లేదు. అందుకనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇపుడిచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. ప్రధాన బెయిల్ పిటీషన్ను వచ్చేనెల 10వ తేదీన విచారిస్తామని చెప్పింది. వచ్చేనెల 24వ తేదీన తనంతట తానుగా చంద్రబాబు కోర్టులో సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనికి చంద్రబాబు అంగీకరించటంతో మధ్యంతర బెయిల్ మంజూరైంది.

దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లను ఎంగేజ్ చేసుకున్నా చంద్రబాబుకు ఏ రూపంలో కూడా బెయిల్ దొరకలేదు. పైగా చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. అందుకనే అన్నీకేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిళ్ళకి దరఖాస్తు చేసుకున్నా ఉపశమనం దొరకలేదు. అందుకనే జైలులో భద్రత లేదని ప్రాణపాయం ఉందని లాయర్లు వాదించినా ఉపయోగం కనబడలేదు. దాంతో చివరకు ఆఖరి అస్త్రంగా అనారోగ్యం కారణంతో మధ్యంతర బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి అనారోగ్యం అన్న కారణంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దొరికింది. ఏదేమైనా చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్ అనే చెప్పాలి.