Begin typing your search above and press return to search.

నేనే పోటీ చేస్తా... ఫిట్టింగ్ పెడుతున్న టీడీపీ పెద్దాయన...!

టీడీపీకి చెందిన పెద్దాయనగా గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిని పేర్కొంటారు

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:38 PM GMT
నేనే పోటీ చేస్తా... ఫిట్టింగ్ పెడుతున్న టీడీపీ పెద్దాయన...!
X

టీడీపీకి చెందిన పెద్దాయనగా గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిని పేర్కొంటారు. ఆయన ఎన్టీయార్ హయాం నుంచి పార్టీలో ఉన్నారు. అనేక సార్లు రాజమండ్రి నుంచి గెలిచిన సీనియర్ మోస్ట్ నేత. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన నేపధ్యంలో రాజమండ్రి రూరల్ కి ఆయన వెళ్లారు. 2014, 2019లలో ఆయన గెలిచారు.

ఇక మరోసారి తానే పోటీ చేస్తాను అని లేటెస్ట్ గా పెద్దాయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. రాజమండ్రి రూరల్ సీటు నాదే అని బిగ్ సౌండ్ చేశారు. దానికి ఆయన చెప్పిన రీజన్ కూడా లాజిక్ కి సరిపోయేలా ఉంది. సిట్టింగులందరికీ ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఖాయమని చంద్రబాబు చాన్నాళ్ల క్రితమే చెప్పారు. దాంతో ఆ పాయింట్ ని బేస్ చేసుకుని గోరంట్ల చెబుతున్నదేంటి అంటే తనదే రూరల్ సీటు అని.

దాంతో తాను పోటీ చేయడం తధ్యం అలాగే గెలవడం కూడా ఖాయమని గోరంట్ల స్పష్టం చేశారు. సరిగ్గా ఇదే ఇపుడు రాజమండ్రి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. రాజమండ్రి రూరల్ టికెట్ ని జనసేన కోరుకుంటోంది. ఆ పార్టీకి చెందిన నాయకుడు కందుల దుర్గేష్ 2019లో ఇదే సీటు నుంచి పోటీ చేసి మంచి మెజారిటీని సాధించారు. ఈసారి కూడా ఆయన అదే సీటు కోరుకుంటున్నారు.

టీడీపీతో పొత్తులో భాగంగా ఆయనకు రూరల్ టికెట్ ఇస్తారని ప్రచారం కూడా కొద్ది రోజులుగా సాగుతోంది. అదే విధంగా గోరంట్లకు ఎమ్మెల్సీగా చేస్తారని కూడా అంటున్నారు. మరి ఈ సర్దుబాటు వార్తలు పెద్దాయనకు చేరాయా లేక చేరిన తరువాత కూడా ఆయన రియాక్షన్ ఇదేనా అన్నది తెలియదు కానీ సైలెంట్ గా ఆయన బాంబు పేల్చేశారు. రూరల్ సీటు నదే అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేనకు ఈ సీటు ప్రతిష్టగా ఉంది. కందుల దుర్గేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడు. దాంతో పాటు జనసేన కోరే సీట్లలో ఇది కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. సో అలా కనుక చూస్తే రాజమండ్రి రూరల్ సీటు టీడీపీలో అతి పెద్ద పంచాయతీనే క్రియేట్ చేయబోతోంది అని అంటున్నారు.

ఇక చూసుకుంటే గోరంట్ల ఉమ్మడి రాజమండ్రీకి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు రాజమండ్రి అర్బన్ లోనూ పట్టుంది. దాంతో రూరల్ కాదు అంటే అర్బన్ అయినా పెద్దాయనకు ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుకున్నారు. అయితే కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు ఈ సీటు నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో బుచ్చయ్యకు సీటు అక్కడ కూడా ఉండదు అని అంటున్నారు. దాంతో బుచ్చయ్య ఏమి చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన మాత్రం రూరల్ టికెట్ నాదే అనడం మాత్రం టీడీపీలో అగ్గి రాజేసేలా ఉంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఇదే రాజమండ్రి రూరల్ సీటు నుంచి పోటీ చేసేందుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ రెడీ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆయన్ని రాజమండ్రి రూరల్ కి బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో 2019లో ఇదే సీటు నుంచి పోటీ చేయాలని చందన నాగేశ్వరరావు చూస్తున్నారు. ఆయన వైసీపీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నారు. దాంతో ఆయనకు ఈసారికి హ్యాండ్ ఇస్తారని అంటున్నారు. మరి ఆయన వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా రాజమండ్రి రాజకీయం ఈసారి రంజుగా ఉంటుందని అంటున్నారు. పైపెచ్చు రాజమండ్రి రూరల్ సీటు విషయంలోనే అంతా రాజకీయం సాగుతోంది. మరి గోరంట్ల వర్సెస్ కందుల దుర్గేష్ గా టీడీపీ ఎపిసోడ్ ఉంటే మంత్రి చెల్లుబోయిన వర్సెస్ చందన నాగేశ్వరరావు అన్నట్లుగా ఉందిట.

ఇక ఇదే పాయింట్ మీద గోరంట్ల కూడా సీరియస్ కామెంట్స్ చేశరు. ఇంట గెలవని వారు రచ్చ గెలుస్తారా అన్న కామెంట్స్ మంత్రి వేణుని ఉద్దేశించి అనే అంటున్నారు. మొత్తానికి రాజమండ్రి రగడ ఇరు పార్టీలలోనూ స్టార్ట్ అయింది అనే అనుకోవాలి.