ఓవరైంది మాధవా...కూటమి వెరీ సీరియస్ !
అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారిగా ఉండి అప్పటి టీడీపీ బిగ్ ఫిగర్స్ అయిన జేసీ బ్రదర్స్ మీద మీసాలు మెలేసిన ఇష్యూతో వెలుగులోకి వచ్చారు గోరంట్ల మాధవ్.
By: Tupaki Desk | 13 April 2025 9:07 AM ISTఅనంతపురం జిల్లాలో పోలీస్ అధికారిగా ఉండి అప్పటి టీడీపీ బిగ్ ఫిగర్స్ అయిన జేసీ బ్రదర్స్ మీద మీసాలు మెలేసిన ఇష్యూతో వెలుగులోకి వచ్చారు గోరంట్ల మాధవ్. ఆయనలోని ఫైర్ బ్రాండ్ ని చూసి వైసీపీ ఫుల్ సపోర్ట్ చేసింది. ఇదే అదనుగా తనలోని పొలిటికల్ యాంబిషన్ ని ఆయన బయట పెట్టారు. కట్ చేస్తే అలా జాబ్ కి రిజైన్ చేయడం ఇలా వైసీపీ ప్రభంజనంలో 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీ కావడం చకచకా జరిగిపోయాయి.
ఇక వైసీపీ అధికారంలో ఉన్న టైం లో గోరంట్ల మాధవ్ అనేక విధాలుగా వార్తలలోకి ఎక్కారు. అలా తరచూ వివాదాలలో కనిపించేవారు. ఒక ఆయన పేరిట వచ్చిన ఒక న్యూడ్ వీడియో కూడా అత్యంత వివాదమై ఏకంగా వైసీపీ మెడకే చుట్టుకుంది. దాని ఫలితంగా ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ని వైసీపీ హైకమాండ్ ఇవ్వలేదు.
ఇక వైసీపీ ఓటమి పాలు అయ్యాక కొన్నాళ్ళు సైలెంట్ అయిన గోరంట్ల ఈ మధ్య మళ్ళీ తన ఓల్డ్ స్టైల్ కి న్యూ లుక్ ఇచ్చి మరీ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో రాజకీయ తెర మీదకు సరికొత్తగా వస్తున్నారు. ఆయన జగన్ మీద ఎవరైనా ఏమైనా అంటే వెంటనే మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
అందులో కూడా ప్రచారంలో నానాలని అతి చేస్తున్నారు అని అంటున్నారు. ఈ అతికే పరాకాష్ట అన్నట్లుగా ఆయన ఇపుడు గుంటూరు దాకా కారులో వచ్చి ఐ టీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ ని పోలీసులు తీసుకుని వెళ్తున్న వాహనాన్ని అడ్డడం అని అంటున్నారు. అంత అవసరం ఆయనకు ఏమి వచ్చిందని అంటున్నారు.
కిరణ్ మీద కేసు కట్టారు. తప్పు చేసిందని నిరూపణలు ఉంటే కచ్చితంగా శిక్షలు పడతాయి. అంతా చట్టం న్యాయం ప్రకారం జరుగుతుంది. ఇందులో సొంతంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పని లేదు అన్నది మాజీ పోలీసు అధికారి అయిన మాధవ్ కి తెలియదా అని అంటున్నారు. ఆయన కారుని పోలీస్ వాహనానికి అడ్డంగా పెట్టి డోర్ తీసి కిరణ్ ని బయటకు తేవాలని చేసే ప్రయత్నం వీడియో విజువల్స్ వల్ల ఆయనకు పాపులారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ అది బూమరాంగ్ అయింది అని అంటున్నారు
ఏదో విధంగా అధినాయకత్వం మెప్పు పొంది ఈసారి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ సీటు కోసం మాధవ్ చేసే ఓవర్ యాక్షన్ ఇది అని సొంత పార్టీలో గుసగుసలు పోతున్నారుట. మరో వైపు చూస్తే మాధవ్ రాప్తాడు మీదనే కన్నేశారని అక్కడ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీటుకే ఎసరు పెట్టాలని చూస్తున్నారని అందుకే ఈ ఓవర్ యాక్షన్ అని అంటున్నారు.
అయితే ఈ అతి చేష్టలతో మాధవ్ కూటమి పెద్దలకు అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు. ఇపుడు ఆయన మీద వరస కేసులు పడుతున్నాయి. పోలీసుల విధులకు అడ్డుకున్నారన్న కేసుతో పాటు మంత్రి నారా లోకేష్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారన్న దాని మీద మరో కేసు ఆయన మీద పెట్టారని అంటున్నారు. ఇక పాత తవ్వకాలు కూడా చాలా ఉంటాయని దాంతో మాధవ్ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారా అని అంటున్నారు.
