Begin typing your search above and press return to search.

విశాఖ డైరెక్ట్ కనెక్షన్ విత్ వరల్డ్

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దాంతో విశాఖ దశ తిరగబోతోంది.

By:  Satya P   |   28 April 2026 11:29 AM IST
విశాఖ డైరెక్ట్ కనెక్షన్ విత్ వరల్డ్
X

విశాఖలో సరికొత్త చరిత్ర మొదలైంది. మరో నూతన అధ్యాయానికి నాందీ ప్రస్తావన జరిగింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దాంతో విశాఖ దశ తిరగబోతోంది. ఐటే ఏఐ హబ్ గా విశాఖ మారనుంది. విశాఖ ఇంటర్నేషనల్ టెక్ మ్యాప్ లో కీలకమైన సుస్థిరమైన స్థానాన్ని అందుకోనుంది. విశాఖ అచ్చమైన గ్లోబల్ సిటీగా మారబోతోంది. అంతే కాదు విశాఖ ఇపుడు కేరాఫ్ గూగుల్ గా నిలవనుంది.

ఆ నగరాల సరసన :

ఇప్పటి వరకూ ముంబై, చెన్నై వంటి మహా నగరాలకే పరిమితమైన డేటా సెంటర్ లు ఇపుడు విశాఖలోకి అడుగు పెట్టాయి. దాంతో కంప్యూట్ రంగంలో ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ద్వారా ఏఐ రంగంలో భారత్ ఓ పెద్ద ముందడుగు వేసిందని చెప్పాలి. విశాఖ నగరం ఇక భారత కొత్త డిజిటల్ గేట్ వేగా మారనుంది. భారత్ తో పాటు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది.

డిజిటల్ ఇన్ ఫ్రా వేగంగా :

విశాఖ డేటా సెంటర్ ఏర్పాటుతో డిజిటల్ ఇన్ ఫ్రా వేగంగా నిర్మితం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే విశాఖ నగరం ఏఐ రివల్యూషన్ కు నాంది పలికింది. అంతే కాదు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం మంచి పరిణామంగా ఉంది. దీని వల్ల ఎక్కువ మంది ప్రజలకు వాణిజ్యానికి పరిశ్రమలకు ఏఐ సేవలు అందించడం జరుగుతుంది.

రూపు రేఖలు మారుతాయి :

విశాఖ ఉమ్మడి ఏపీలోనే వేగంగా ఎదుగుతున్న నగరంగా ఉంది. ఇక విభజన ఏపీలో అతి పెద్ద నగరంగా మారింది. దాంతో విశాఖ సమీప భవిష్యత్తులో హైదరాబాద్ ముంబై, చెన్నై, బెంగళూరులతో సరిసమానంగా ధీటుగా ఎదిగేందుకు తన సాంకేతిక ఐటీ డిజిటల్ సామర్ధ్యాన్ని విస్తరించేందుకు ఆస్కారం ఏర్పడింది. అంతే కాదు విశాఖ చుట్టు పక్కన వస్తున్న కొత్త పరిశ్రమలు అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు భోగాపురంలో ఉండడం వంటి వాటిని బట్టి చూస్తే విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ గా అతి తొందరలో మారుతోంది అని అంటున్నారు. అదే సయంలో విశాఖ అతి పెద్ద ఆదాయ వనరుగా మారి రాష్ట్రానికి ప్రగతి దిక్సూచిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్ళు ఆగితే :

మరో రెండేళ్ళు ఆగితే చాలు విశాఖ రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. విశాఖలో డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుంది. అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ మొదటి దశ పూర్తి అవుతుంది. అదే విధంగా రెన్యువబుల్ ఎనెర్జీ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. ఇతర పరిశ్రమలు అన్నీ కూడా ఆపరేషన్ లోకి వస్తాయి. దాంతో విశాఖ అతి పెద్ద ఉపాధి కల్పనా కేంద్రంగా కూడా మారుతుందని అంటున్నారు.