బాబోయ్ బంగారం ధరలు ! రేటు చూస్తే గుండె జారిపోద్ది!
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి.
By: Tupaki Desk | 10 April 2025 10:33 AM ISTహైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఊహించని విధంగా షాకిచ్చాయి.
22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2,700 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 85,600కు చేరుకుంది. ఇక అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరింతగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 2,940 పెరిగి ప్రస్తుతం రూ. 93,380 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర ఒక్కసారిగా ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2,000 పెరిగి ప్రస్తుతం రూ. 1,04,000కు చేరుకుంది. బంగారం మరియు వెండి ధరలు ఒక్కసారిగా ఇంత భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఇతర ఆర్థిక అంశాలు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రికార్డు స్థాయి ధరల పెరుగుదల సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు ఇలా పెరగడం కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
