సామాన్యుడిపై భారం.. ఆల్ టైం రికార్డ్ సృష్టించిన 22K గోల్డ్!
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 22 క్యారెట్ల బంగారం ఏకంగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 9 Sept 2025 3:17 PM ISTచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 22 క్యారెట్ల బంగారం ఏకంగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. వాస్తవానికి బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలి అంటేనే భయపడిపోతున్న రోజులు ఏర్పడ్డాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా భారతదేశంలో బంగారం ధరలు మరింత పెరిగిపోయాయి. సాధారణంగా భారతదేశంలో బంగారు ఆభరణాలకు, వస్తువులకు ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ఎంత ఖరీదైనా సరే బంగారం కొనుగోలు చేసి తీరుతారు. మరికొంతమంది పండుగ వచ్చిందంటే చాలు తప్పకుండా బంగారం కొనుగోలు చేయాలనే పట్టుదలతో కూడా ఉంటారు.అలాంటి వారందరికీ ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది అని చెప్పవచ్చు.
సాధారణంగా బంగారం ధరలో మార్పులు వచ్చినప్పుడు రూ.200 నుండి రూ.700 లోపు మాత్రమే ఈ ధరలు పెరిగేవి. అయితే గత 15 రోజులుగా ఈ పెరుగుదల నిర్విరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఏకంగా లక్ష దాటి సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సెప్టెంబర్ 9న బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. ఈరోజు ఏకంగా 1,360 రూపాయలు తులం బంగారం పై పెరిగింది. ఈ పెరుగుదలతో.. 24 క్యారెట్ల గోల్డ్ బంగారం ధర రూ.1,10,290 కాగా.. అటు 22 క్యారెట్లపై ఏకంగా రూ. 1250 పెరిగి రూ.1,01,100 కి చేరుకుంది. ఇకపోతే ఈరోజు బంగారం ధరలలో భారీ మార్పులు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నమోదైన ఈ బంగారం ధరలు ఏ ఏ ప్రాంతాలలో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,290
విజయవాడ..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,290
గుంటూరు..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,290
ప్రొద్దుటూరు..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,290
బెంగళూరు..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,290
ముంబై..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,290
చెన్నై..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,730
ఢిల్లీ..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ.1,01,250
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -రూ.1,10,440
వెండి ధరలు..
ఈరోజు వెండి ధరలలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.1,40,000 గా నమోదు అయ్యింది.