Begin typing your search above and press return to search.

గంటా సైకిల్ దిగుతారా...!?

ఈ సమావేశంలో ఆయన తీసుకునే నిర్ణయం ఆయన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని అంటున్నారు. గంటా వైసీపీ వైపు వెళ్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   14 March 2024 11:30 AM GMT
గంటా సైకిల్ దిగుతారా...!?
X

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అధినాయకత్వం పొమ్మనకుండా పొగ పెడుతోంది అని అంటున్నారు. లేకపోతే ఉమ్మడి విశాఖ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న గంటాను విజయనగరం జిల్లాలో పోటీ చేయమనడమేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ వైసీపీకి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.

ఆయన చీపురుపల్లిలో గత రెండు దశాబ్దాలుగా ఉంటూ పట్టు సాధించారు. ఇప్పటికి మూడు ఎన్నికల్లో గెలిచారు. మరోసారి ఆయన విజయం అక్కడ ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గంటా అక్కడికి వెళ్తే గెలుస్తారా అన్న చర్చ వస్తోంది. గంటాకు విశాఖలో టికెట్ ఇవ్వకుండా చీపురుపల్లి పంపడంలో ఆంతర్యం అదే అని అంటున్నారు.

గెలిస్తే ఓకే లేకపోతే లేదు అన్నట్లుగా అధినాయకత్వం ఆయన విషయంలో వ్యవహరిస్తోంది అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే విషయం నలుగుతోంది. చీపురుపల్లి వెళ్లి పోటీ చేయడం ఒక్కటే గంటా ముందు ఉన్న మార్గం అని అంటున్నారు.

అయితే ఆయన అక్కడ నానా కష్టాలు పడి గెలిచినా కూడా ఆ జిల్లాలో ఒక సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు అని అంటున్నారు. రేపటి రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చినా గంటాకు మంత్రి పదవి కూడా దక్కదు అని అంటున్నారు జిల్లా కోటాలో బొబ్బిలి రాజులు ఉంటారు.

అంటే జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉండడం కోసం అంత దూరం వెళ్లాలా అన్న చర్చ వస్తోంది. మరో వైపు చూస్తే విశాఖ ప్రధాన నగరం అలాంటి చోటు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఒక విలువ గౌరవం ఉంటాయని అంటున్నారు. గంటా కూడా అదే తలచారు అని అంటున్నారు.

ఆయన విశాఖ జిల్లా భీమిలీ నుంచి మళ్లీ గెలిచి మంత్రి కావాలని చూస్తున్నారు. కానీ సొంత పార్టీలో ఆయన ప్రత్యర్ధి వర్గం ఈసారి వేగంగా పావులు కదిపింది అని అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే గంటాకు ఇపుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది అని అంటున్నారు. భీమిలీ సీటు జనసేనకు ఇవ్వడం లేదు, అయినా గంటాకు అక్కడ సీటు ఇవ్వకపోవడం అంటే ఏమి ఆలోచించాలని అంటున్నారు ఆయన అనుచరులు.

దాంతో గంటాకు ఒక విషయం అర్ధం అయింది అని అంటున్నారు. ఆయన తాజాగా చంద్రబాబుని కలసి విశాఖ జిల్లాలో ఎక్కడ అయినా సీటు ఇవ్వమని కోరారు అని అంటున్నారు కానీ బాబు మాత్రం చీపురుపల్లి వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు అని అంటున్నారు. ఈ క్రమంలో తన అనుచరులతో అభిమానులతో గంటా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఆయన తీసుకునే నిర్ణయం ఆయన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని అంటున్నారు. గంటా వైసీపీ వైపు వెళ్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. వైసీపీలోకి వెళ్లి భీమిలీ సీటుని సంపాదించుకుంటారా అన్నది కూడా ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఏమిటి అన్నవి వెల్లడి కావడంలేదు.

మొత్తానికి గంటా పాతికేళ్లుగా సాగిస్తున్న తన రాజకీయ జీవితానికి పెద్ద బ్రేక్ పడబోతోందా అంటే జవాబు అవును అని వస్తోంది. ఆయనకు టీడీపీ అనేక అవకాశాలు ఇచ్చింది. అయితే టీడీపీ గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడుతున్న వేళ గంటా ఆ పార్టీకి దూరంగా ఉన్నారని కనీసం పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఇపుడు అధినాయకత్వం టైం చూసి ఇలా చేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా రాజకీయం ఏ వైపు అన్నది మాత్రం హాట్ హాట్ చర్చగా ఉంది.