Begin typing your search above and press return to search.

విశాఖ ఆక్టోపస్ జోస్యం...ఏపీలో గెలిచేది ఏ పార్టీ అంటే...?

ఇక ఇపుడు చూస్తే 2024లో గెలిచేది కచ్చితంగా టీడీపీయే అని గంటాకు అంచనా ఉండబట్టే ఆయన జోరు చేస్తున్నారు అని అంటున్నారు

By:  Tupaki Desk   |   5 Aug 2023 4:02 AM GMT
విశాఖ ఆక్టోపస్ జోస్యం...ఏపీలో గెలిచేది ఏ పార్టీ అంటే...?
X

ఏపీకి ఆక్టోపస్ గా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఉండేవారు. ఆయన చెప్పిన చాలా జోస్యాలు నిజం అయ్యాయి. అయితే 2018లో తెలంగాణా రిజల్ట్, 2019లో ఏపీ రిజల్ట్ మాత్రం ఆయన చెప్పినవి రివర్స్ అయ్యాయి. దాంతో ఆయన రాజకీయ జోస్యాలు చెప్పడమే ఏకంగా మానుకున్నారు.

అయితే విశాఖ ఆక్టోపస్ కూడా ఉన్నారు. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఆయన ప్రతీ ఎన్నికకు ముందు గెలిచే పార్టీ ఏది అని అంచనా కడుతూంటారు. వీలైతే తాను ఆ పార్టీలో ఉండాలని అనుకుంటారు. అయితే 2019లో గంటాకు వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలుసు కానీ అనివార్య కారణాల వల్ల టీడీపీలో ఉన్నారని అంటారు.

ఇక ఇపుడు చూస్తే 2024లో గెలిచేది కచ్చితంగా టీడీపీయే అని గంటాకు అంచనా ఉండబట్టే ఆయన జోరు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పక్కగా ఏపీలో గెలిచేది చంద్రబాబే అని అంటున్నారు. ఇందులో ఏ మాత్రం డౌట్ ఎవరికీ అవసరం లేదని అంటున్నారు.

చంద్రబాబు రాయలసీమ టూర్ నూరు శాతం సక్సెస్ అయిందని, ఏకంగా పులివెందులలోనే చంద్రబాబుకు జనాలు విరగబడి వచ్చారు అంటేనే అది అతి పెద్ద సానుకూల సంకేతం అని అంటున్నారు. వై నాట్ పులివెందుల అని తాము అందుకే నిబ్బరంగా అంటున్నామని కూడా గంటా చెబుతున్నారు ఇక తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫేస్టో కూడా జనాల్లోకి వెళ్లిపోయిందని, ఎక్కడికి వెళ్ళినా చంద్రబబుకు లోకేష్ బాబుకు జనాలు బ్రహ్మరధం పడుతున్నారని అన్నారు.

ఏపీ ప్రజలు అంతా ఇపుడు టీడీపీని అధికారంలోకి తీసుకుని వద్దామని చూస్తున్నారని గంటా అంటున్నారు. ఆరు నూరు అయినా ఏపీలో జరిగేది ఇదే అని అన్నారు. ఏపీలో అభివృద్ధి జరగాలన్నా లేక ఏపీకి మేలు జరగలాన్నా చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యం అన్నది జనాలకు తెలిసింది అని గంటా అంటున్నారు.

మొత్తానికి ఎన్నికలు తొమ్మిది నెలల్లో ఉన్నాయనగా గంటా రాజకీయ జోస్యం వదిలారు. ఆయన టీడీపీలో ఉంటున్నారు అంటేనే గెలుస్తుంది అని అర్ధం చేసుకోవాలని అంటున్నారు. మరి గంటా చెప్పిన ఈ జోస్యం నిజం అవుతుందా విశాఖ ఆక్టోపస్ కి ఈసారి అయినా మంత్రి యోగం ఉందా లేదా లెక్క ఎక్కడో తప్పి మళ్లీ ఆయన విపక్షంలో ఉంటారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.

సభలకు జనాలు విరగబడి వస్తున్నారు అంటే గెలుపునకు దాన్ని కొలమానంగా తీసుకోవడం ఎపుడో అంతా పక్కన పెట్టారు అన్నది కూడా విశాఖ ఆక్టోపస్ గుర్తెరగాలి అని అంటున్నారు. అలాగే పధకాలు గెలిపిస్తాయని అనుకున్నా వైసీపీ కూడా అలాంటి పధకాలెనే ఇపుడు అమలు చేస్తోంది అన్నది కూడా మరువరాదని అంటున్నారు.

సో వచ్చే ఎన్నికలు మాత్రం ఏ రాజకీయ పార్టీకి క్యాట్ వాక్ అయితే కాదు, హోరా హోరీ పోరు, గెలిచిన వారికీ ఓడిన వారికీ కూడా అతి స్వల్ప తేడాయే ఉంటుంది అన్నది నిక్కచ్చి అయిన విశ్లేషణగా ఉంది అంటున్నారు. మరి అంతలా చివరి దాకా హోరా హోరీ పోరు సాగే యుద్ధంలో విజేత ఎవరో ఇప్పటి నుంచే చెప్పడం జరిగే పనేనా అంటే కాదు అనే చెప్పాలి. విశాఖ ఆక్టోపస్ ఎందుకలా చెబుతున్నారు అంటే ఆయన ఉన్న పార్టీ టీడీపీ కాబట్టి గెలవాలని చూస్తారు అని అంటున్నారు.