Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే: క్లాస్ పాలిటిక్స్ ఓకే.. మాసే స‌మ‌స్య‌.. !

ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా విజ‌యం ద‌క్కించుకున్న వారిలో కొంద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు.

By:  Garuda Media   |   25 March 2026 8:00 PM IST
ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే: క్లాస్ పాలిటిక్స్ ఓకే.. మాసే స‌మ‌స్య‌.. !
X

ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా విజ‌యం ద‌క్కించుకున్న వారిలో కొంద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. అయితే. వీరిలో కొంద‌రు మాస్ పాలిటిక్స్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. మ‌రికొంద‌రు మాత్రం.. క్లాస్ పాలిటిక్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సీనియ‌ర్ నాయ‌కురాలు, రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వ‌రి.. క్లాస్ పాలిటిక్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం .. క్షేత్ర‌స్థాయిలో మాస్‌కు ఇవ్వ‌డం లేదు. పార్టీ స‌మావేశాల‌కు వ‌చ్చి.. మీడియా మీటింగుల‌కు హాజ‌రై.. వెళ్లిపోతున్నారు.

వాస్త‌వానికి.. రెండేళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల స‌మస్య‌లు ఏమేర‌కు తీరాయి? కేంద్రం నుంచి ఎంత వ‌ర‌కు నిధులు తెచ్చారు? నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంత మేర‌కు ప‌నులు చేయించార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారుతోంది. ఇలాంటి వేళ‌.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి. కానీ, ఏసీ రూమ్‌లు.. ప్రెస్ కాన్ఫ‌రెన్సుల‌కే పురందేశ్వ‌రి ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న‌ది స్థానికంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇక‌, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే, జ‌న‌సేన నాయ‌కురాలు.. లోకం మాధ‌వి ప‌రిస్థితి కూడా ఇలానే ఉందన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈమె కూడా.. క్లాస్ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఉన్న‌త విద్యావంతురాలు.. ఐటీ కంపెనీ ల‌కు అధిప‌తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. కానీ, ఎంత చ‌దువున్నా.. ప్ర‌జ‌ల‌కు ఇవ‌న్నీ కాదు.. క్షేత్ర‌స్థాయిలో ఏమేర‌కు అందుబాటులో ఉంటున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం లోకం మాధ‌వికి ఉన్న పేరు.. `వీకెండ్ పొలిటీషియ‌న్‌` అనే. ఆమెకు ఇష్టం ఉన్నా.. లేక‌పోయినా.. తెర‌చాటున ఎమ్మెల్యే గురించి ఇదే చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం ఆమె అన్వేషించుకోవాలి.

ఇక‌, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి. ఆర్థిక ప‌రిపుష్టికి లోటు లేదు. అదేస‌మ‌యంలో క్లాస్ పాలిటిక్స్‌కే ప‌రిమితం కావ‌డం.. మైన‌స్‌గా మారుతోంది. సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చేలా కూడా చేస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా.. కాలు బ‌య‌ట పెట్టేందుకు సంకోచిస్తున్నార‌న్న‌ది స్థానికంగా వినిపిస్తున్న మాట‌. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు లేవు. ఉన్నా.. ముందుగానే.. స‌మాచారం ఇచ్చి వెళ్తున్నారు.

దీంతో వాస్త‌వ ప‌రిస్థితులు వ‌దిలేస్తున్న అధికారులు.. ప్ర‌భుత్వ సిబ్బంది.. అంతా `క్లీన్‌`గా చేసేస్తున్నారు. ఫ‌లితంగా మాస్‌లో ఆమెపై పెద్ద‌గా చ‌ర్చ‌లేకుండా పోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్తితులు మారే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు ఇప్పుడే అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే ప‌నితీరును స‌మీక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.