Begin typing your search above and press return to search.

ఈ మృగం చేసిన పనికి పడిన శిక్ష తక్కువే

మనిషి అన్న స్ప్రహ లేకుండా చేసే కొన్ని దారుణ చేష్టల గురించి తెలిసినంతనే.. మనిషి కాదు మృగం అని అనేస్తారు

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:57 AM GMT
ఈ మృగం చేసిన పనికి పడిన శిక్ష తక్కువే
X

మనిషి అన్న స్ప్రహ లేకుండా చేసే కొన్ని దారుణ చేష్టల గురించి తెలిసినంతనే.. మనిషి కాదు మృగం అని అనేస్తారు. కానీ.. మృగాలు సైతం చేయలేని పనుల్ని మనుషులు చేస్తుంటారు. తాజాగా పిశాచి లాంటోడికి కోర్టు పాతికేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. పాతికేళ్లు జైలా? అనుకోవచ్చు కానీ.. ఇతగాడు చేసిన దారుణం తెలిస్తే.. ఈ శిక్ష కూడా తక్కువే అనేయటం ఖాయం. ఇంతకూ జరిగిందేమంటే..

హైదరాబాద్ మహానగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన నిందితుడు.. ఇంట్లో భార్య లేని సమయంలో తన పదకొండేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కడుపు నొప్పితో బాధ పడుతుంటే నిలదీయగా.. అసలు దారుణం బయటకు వచ్చింది. తండ్రి తనను బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేశాడని తల్లికి చెప్పి భోరుమంది.

దీంతో.. ఆమె చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ వెంటనే స్పందించిన పోలీసులు.. బాధిత బాలికను భరోసా సెంటర్ కు తరలించారు. అక్కడ ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసి.. ఆధారాలు సేకరించారు. నిందితుడి మీద ఫోక్సో తో పాటు ఇతర సెక్షన్లతో కేసుల్ని నమోదు చేశారు. దీనికి సంబంధించిన న్యాయవిచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. కన్న కూతురి మీద లైంగిక దాడి జరిపిన నిందితుడికి పాతికేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేలు ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు గురించి తెలిసిన వారు.. నిందితుడికి మరింత కఠిన శిక్ష విధించినా తప్పు లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.