Begin typing your search above and press return to search.

నారాయణను వెంటాడుతున్న పొంగూరి ప్రియ...రింగ్ రోడ్ కేసుపై కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కాం కేసులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Oct 2023 8:17 AM GMT
నారాయణను వెంటాడుతున్న పొంగూరి ప్రియ...రింగ్ రోడ్ కేసుపై కీలక వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కాం కేసులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ విచారణను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజగాగా మాజీమంత్రి నారాయణ మరదలు లైన్ లోకి వచ్చారు!

అవును... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌ మెంట్‌ కేసులో మాజీ మంత్రి నారాయణను సీఐడీ అధికారులు సోమవారం విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో తనను కూడా విచారించాలని సీఐడీని కోరుతూ నారాయణ మరదలు పొంగూరు ప్రియ. ఇదే సమయంలో... సోమవారం జరిగే విచారణలో ఏమీ తెలియదని, గుర్తులేదని నారాయణ చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో... సీఐడీ అధికారులు సోమవారం చేపట్టనున్న విచారణలో నారాయణ తనకేమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని తెలిపిన ప్రియ... నారాయణకు అన్నీ తెలుసని స్పష్టం చేశారు. అంతేకాదు.. నారాయణకు ఎక్కడెక్కడ బినామీల పేరుతో స్థలాలు ఉన్నాయో తనకు తెలుసని ఆమె తెలిపారు. అందువల్ల... సీఐడీ అధికారులు ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని ఆమె కోరారు.

తద్వారా తాను దర్యాప్తునకు సహకరించినట్టు అవుతుందని భావిస్తున్నట్టు ప్రియ చెప్పారు. ఒక పర్సన్‌ వల్ల తీగ లాగితే డొంక కదులుతుందని ఆమె ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఆ పర్సన్‌ ఎవరో విచారణలో తాను వెల్లడిస్తానని ఆమె తెలిపారు. ఇదే క్రమంలో... రింగ్‌ రోడ్‌ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో అధికారులకు తెలుస్తుందని వివరించారు.

ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో సీఐడీ అధికారులకు ఉపయోగపడుతుందని ఆ వీడియోలో ప్రియ పేర్కొన్నారు. మరి... పొంగూరు ప్రియ చేసిన విజ్ఞప్తిపై సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి. అయితే... ఆమె వద్ద ఏమైనా సమాచారం ఉంటే... విచారణలోనే కాకుండా, నేరుగా కలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.