Begin typing your search above and press return to search.

అచ్చెన్న మాట నెగ్గడంలేదా...!?

అయితే టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు లాంటి చురుకైన నాయకత్వం ఉన్న చోట ఏపీ ప్రెసిడెంట్ అయినా ఆరవ వేలు లాంటిదే అని అంటారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:10 AM GMT
అచ్చెన్న మాట నెగ్గడంలేదా...!?
X

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట సొంత జిల్లాలోనే నెగ్గడంలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు రెండేళ్ళ క్రితం టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు లాంటి చురుకైన నాయకత్వం ఉన్న చోట ఏపీ ప్రెసిడెంట్ అయినా ఆరవ వేలు లాంటిదే అని అంటారు.

పైగా టీడీపీ పేరుకు జాతీయ పార్టీ అని అన్నారు. కానీ దాని అస్థిత్వం మూలాలూ అన్నీ ఏపీలోనే ఉన్నాయి. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఈ ఇద్దరే టీడీపీ విధాన నిర్ణయకర్తలుగా ఉంటారు. పోనీ జిల్లా స్థాయిలో అయినా అచ్చెన్న పలుకుబడి సాగుతోందా అంటే ఇపుడు అక్కడ కూడా బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలలో అచ్చెన్నాయుడు ఎవరికైనా టికెట్ కోసం సిఫార్సు చేసినా హై కమాండ్ నుంచి దక్కే పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికి మూడేళ్ల క్రితం తిరుపతిలో ఒక హొటల్ రూం లో అచ్చెన్నాయుడు ఆఫ్ ది రికార్డు గా మాట్లాడిన పార్టీ లేదు బొక్కా లేదు అన్న మాటలు దానితో పాటు చినబాబు మీద చేసిన కామెంట్స్ అన్నీ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

నాటి నుంచి టీడీపీలో కొంత గ్యాప్ అయితే అచ్చెన్నకు ఏర్పడింది అని అంటారు. ఇపుడు పాదయాత్ర చేసి తన గ్రాఫ్ పెంచుకున్న లోకేష్ ఎన్నికల వేళ తన ప్రభావం చూపిస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబుతో పాటు పార్టీ వ్యవహారాలని సీరియస్ గా తీసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ శ్రీకాకుళం జిల్లా మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు

అచ్చెన్న కంటే శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ప్రాభవమే బాగుందని అంటున్నారు. ఆయన లోకేష్ కి గతంలోనూ ఇపుడూ కూడా బాగా దగ్గర అని చెబుతారు. నిజానికి కళా వెంకటరావుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కొనసాగించాలని లోకేష్ గట్టిగా పట్టుబట్టారని కూడా అప్పట్లో చెప్పేవారు.

ఇపుడు మారిన పరిణామాల నేపధ్యంలో కళా వెంకట రావుకు లోకేష్ వద్ద పలుకుబడి బాగా పెరిగింది అని అంటున్నరు. దంతో కళా చుట్టూ జిల్లాలోని ఆశావహులు అంతా తిరుగుతున్నారని అంటున్నారు. కళా మాట వేస్తే చాలు తమక్జ్ అవకాశాలు వస్తాయని ఆయన వైపుగా చేరుతున్నారుట. మొత్తానికి ఈసారికి అచ్చెన్నాయుడు తన టెక్కలి ఎమ్మెల్యే సీటుకే పరిమితం అవుతున్నారా అన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు ఈసారి గెలిచినా టీడీపీ గెలిచినా కూడా మంత్రి పదవి మాత్రం అందని పండు అయినా ఆశ్చర్యపోనవసరంలేదు అంటున్నారు.