Begin typing your search above and press return to search.

బన్నీ ఫ్యాన్స్ ని హర్ట్ చేయని కాంగ్రెస్... ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!!

వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:09 AM GMT
బన్నీ ఫ్యాన్స్  ని హర్ట్  చేయని కాంగ్రెస్... ఎంపీ అభ్యర్థుల లిస్ట్  ఇదే!!
X

సుమారు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటి తెలంగాణలో తమకున్నది వాపు కాదని బలమే అని చెప్పాలని భావిస్తుందని అంటున్నారు! ఈ సమయంలో ఎంపీ అభ్యర్థుల విషయంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా బన్నీ మామ పేరు కన్ ఫాం అయ్యిందని అంటున్నారు.

అవును... అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్లుగానే.. లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రతాపం చూపించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది! ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం... వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి... 2014 నుండి బీఆరెస్స్ లోనే ఉన్నారు! ఈ క్రమంలో 2014లో ఇబ్రహీంపట్నం నుండి పోటీ చేసి విఫలమయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం లేదా తన స్వస్థలం నాగార్జునసాగర్‌ నుంచి బీఆరెస్స్ టిక్కెట్ కోసం ప్రయత్నించారు.. కానీ.. కేసీఆర్ కరుణించలేదు! దీంతో హర్ట్ అయిన చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్స్ పార్టీకి జై కొట్టారు.

ఇబ్రహీంపట్నం సమీపంలోని రెండు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్న చంద్రశేఖర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ తన పేరెంట్ పార్టీ అని చెబుతూ ఇటీవల ఆ పార్టీలో చేరిపోయారు! ఈ సమయంలో ఆయనకు మల్కాజ్ గిరీ ఎంపీ టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కథనాలొచ్చిన వేళ.. అవి కన్ ఫాం అని అంటున్నారు. ఇటీవల ఈ విషయంపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి... తన అల్లుడు కూడా ప్రచారం చేసే అవకాశంపై స్పందించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మిగిలిన లోక్ సభ స్థానాలకు కూడా ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా...

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి – మల్కాజ్ గిరీ

సునీతారెడ్డి - చేవెళ్ల

బొంతు రామ్మోహన్ - సికింద్రాబాద్

మైనంపల్లి హన్మంత రావు - మెదక్

సురేష్ కుమార్ షెట్కర్ - జహీరాబాద్

టి. జీవన్ రెడ్డి - నిజామాబాద్

రేఖా నాయక్ - ఆదిలాబాద్

బలరాం నాయక్ - మహబూబాబాద్

అద్దంకి దయాకర్ - వరంగల్

వెంకటేష్ నేత - పెద్దపల్లి

జెట్టి కుసుమ కుమార్ - ఖమ్మం

సమీర్ వలీవుల్లా - హైదరాబాద్

సంపత్ కుమార్ – నాగర్ కర్నూల్

జానారెడ్డి / పటేల్ రమేష్ రెడ్డి - నల్గొండ

వెంకన్న యాదవ్ / సీహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి - భువనగిరి

ప్రవీణ్ రెడ్డి / రాజేంద్ర రావు - కరీంనగర్

వంశీచంద్ రెడ్డి - మహబూబ్ నగర్ ... ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి!