Begin typing your search above and press return to search.

నిన్న ముసలాయన...నేడు సర్వ రోగాల నేత ..!

దీంతో బాబు మీద ఆయన కోర్టులలో సమర్పించిన అఫిడవిట్ల సాక్షిగానే టార్గెట్ చేయడానికి వైసీపీ మాస్టర్ స్కెచ్ గీసింది. మంత్రి కొట్టు సత్యనారాయణ హింట్ ఇచ్చి మరీ ఘాటైన విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:30 AM GMT
నిన్న ముసలాయన...నేడు సర్వ రోగాల నేత ..!
X

టీడీపీ ఎన్నికల వేళ వైసీపీకి ఆయుధాలు ఇస్తోందా అన్న చర్చ సాగుతోంది. కలలో కూడా అనుకోలేదు బాబు జైలుకు పోతారని, అంతే కాదు జైలుకు వెళ్ళి అలా వచ్చేస్తారు అనుకుంటే అక్కడ అర్ధ సెంచరీ కొట్టేశారు. ఏకంగా 52 రోజుల పాటు జైలు గోడల మధ్య నలిగిన చంద్రబాబు ఇక తాను చాణక్యుడిని అని చెప్పుకోలేరని వైసీపీ నేతలు అంటున్నారు.

అదే విధంగా బాబు వీరుడు శూరుడు ఆయనను ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవు అన్న మాటలకు కాలం చెల్లిపోయిందని, అందరి కళ్ళూ బాబు అరెస్ట్ ఆయన జైలు జీవితం తెరిపించేసింది అని అంటున్నారు. అదే విధంగా బాబు నిప్పు అనడానికి ఇంకా అవకాశం అయితేలేదు. ఆయన బెయిల్ మీదనే బయట ఉంటున్నట్లుగానే వ్యవహారం ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే జైలు జీవితం తరువాత బాబు ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అంటే కరెక్ట్ గా జవాబు చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

అదే విధంగా అనేక కేసులు కూడా ఆయనను చుట్టుముడుతున్నాయి. దీంతో బాబు మీద ఆయన కోర్టులలో సమర్పించిన అఫిడవిట్ల సాక్షిగానే టార్గెట్ చేయడానికి వైసీపీ మాస్టర్ స్కెచ్ గీసింది. మంత్రి కొట్టు సత్యనారాయణ హింట్ ఇచ్చి మరీ ఘాటైన విమర్శలు చేశారు.

చంద్రబాబు తనకు సమస్త రోగాలు ఉన్నట్లుగా కోర్టుకు చెప్పుకున్నారు. అన్ని జబ్బులు ఉన్న నాయకుడు ఏపీకి అవసరమా అంటూ ఆయన లాజిక్ పాయింట్ నే తీస్తున్నారు. బాబు ఇక రాజకీయంగా తప్పుకుంటే సో బెటర్ అని ఒక ఉచిత సలహాని ఇచ్చేశారు.

తనకు లేని రోగమే లేదని బాబే కోర్టు ముందు చెప్పుకున్నాక వైసీపీ ఊరుకుంటుందా జబ్బుల బాబు మనకు వద్దు బాబూ అంటోంది. మంత్రి కొట్టు అదే మాటను అంటూ తమ్ముళ్ళకు మంట పుట్టించేశారు. చంద్రబాబు రాజకీయం ఇక చాలు అని కూడా చెప్పేశారు.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబుని వైసీపీ అధినేత జగన్ ముసలాయన అంటూ ఇప్పటిదాకా రాగింగ్ చేస్తూ వచ్చేవారు. అయితే తాను ముసలి వాణ్ణి ఏంటి పాతికేళ్ళ యువకుడిని వయసు జస్ట్ ఒక టెక్నికల్ నంబర్ మాత్రమే అని బాబు గట్టిగా సమర్ధించుకుని డబాయించేవారు.

కానీ ఇపుడు బాబు జైలు జీవితం బెయిల్ కోసం రోగాల చిట్టాతో ఆయన తరఫున న్యాయవాదులు కోర్టుల చుట్టూ తిరగడంతో బాబుకు ఇన్ని జబ్బులు ఉన్నాయా అని జనాలే అనుకునే పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. బాబు జైలుకు వెళ్ళక ముందు తాను దృఢకాయుడిని అని చెబితే సామాన్య జనాలతో పాటు తమ్ముళ్ళు కూడా నమ్మేసేవారు.

మా బాబుకేంటండి అని బడాయి పోయేవారు. కానీ ఇపుడు అదే బాబు బెయిల్ కోసం హెల్త్ ఇష్యూని బయట పెట్టాల్సి వచ్చింది. ఇవి నిజమే అని టీడీపీ ఒప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అందుకే వైసీపీ తమ చేతికి సరికొత్త ఆయుధం దొరికిందని భావిస్తోంది. ఇవాళ కొట్టు సత్యనారాయణ అన్న మాటలనే రేపు మిగిలిన మంత్రులు ఇతర నేతలు అంటారు.

బాబు వంటి వయోవృద్ధుడు ఏపీని అవసరమా అని నిన్న అన్న వైసీపీ పెద్దలు ఇపుడు పాపం ఒంట్లో బాగులేక బెయిల్ తెచ్చుకున్న పెద్ద మనిషిని ఈ వయసులో బాధపెట్టడం అవసరమా అని కూడా అంటారు. బాబుకు రెస్ట్ ఇచ్చేద్దాం, ఆయనకు జబ్బులు ఉన్నాయి కాబట్టి అని వైసీపీ అంటే జనాల నుంచి కూడా అవును అనే వచ్చే అవకాశం ఉందా అంటే పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు. మరి కాదు బాబు బాహుబలి అని చెప్పడానికి టీడీపీకి ఉన్న అవకాశాలు ఏంటి అన్నదే చూడాల్సి ఉంది మరి.