Begin typing your search above and press return to search.

'కాగ్నిజెంట్‌'తో ఏపీకి మేలిదే.. తెలుసా ..!

ఈ క్ర‌మంలోనే ఏపీలోనూ ఈ త‌ర‌హా ప్రాజెక్టు రావ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ వచ్చే రెండేళ్ల నుంచి ప్ర‌వేశాల‌కు అవ‌కాశం ఉంటుంది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 12:00 AM IST
కాగ్నిజెంట్‌తో ఏపీకి మేలిదే.. తెలుసా ..!
X

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. పెట్టుబ‌డులు వ‌రుస‌గా ఉర‌క‌లెత్తుతున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీ కాగ్నిజెంట్ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. త‌న క్యాంప‌స్‌ను విశాఖ‌లో పెట్ట‌నుంది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం 22.19 ఎక‌రాల భూమిని రూ.0.99 పైస‌ల‌కే కేటాయించింది. ఫ‌లితంగా విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడనుందనే చెప్పాలి. కాగ్నిజెంట్ సంస్థ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాంప‌స్‌లు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే ఏపీలోనూ ఈ త‌ర‌హా ప్రాజెక్టు రావ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ వచ్చే రెండేళ్ల నుంచి ప్ర‌వేశాల‌కు అవ‌కాశం ఉంటుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో కూడిన ఐటీ క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు కం పెనీ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ నూతన క్యాంపస్ ద్వారా ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల విభాగాల్లో ప్రధానంగా ఉద్యోగాలు కల్పించనుంది.

దేశంలో ఇదే తొలిసారి.. అనే మాట కూడా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటె లిజెన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. త్వ‌ర‌లోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఏఐ యూనివ‌ర్సిటీని కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. దీంతో రాష్ట్రానికి ఐటీ కేంద్రంగా పేరు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా ఐఐటీలు పెరుగుతున్న క్ర‌మంలో విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా ఏపీ వారికి అనుకూల ల‌క్షిత ప్రాంతం అవుతుంద‌న్న చ‌ర్చ కూడా ఉంది.

ఈ క్ర‌మంలోనే కొత్తగా పెరిగే ఉద్యోగాలకు అనుకూలంగా కూడా ఈ సంస్థ‌ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించ‌నుంది. సుమారు తొలి ఏడాదిలోనే 200 మందికి ఉద్యోగాలు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా త‌దుప‌రి సంవ‌త్స‌రాల నుంచి కూడా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నుంది. రాష్ట్రంలోనే కాకుం డా.. దేశం, ప్ర‌పంచ దేశాల నుంచి కూడా కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు చేసేందుకు యువ‌త వెల్లువెత్త‌ను న్నార‌న్నది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. త‌ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంద‌ని.. పన్నులు.. ఇత‌ర సెస్సుల‌తో స‌ర్కారుకు రాబ‌డి పుంజుకుంటుంద‌ని అంటున్నారు.