బడ్జెట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూడు లక్షల 32 వేల 205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ని రూపొందించారు.
By: Satya P | 15 Feb 2026 12:31 AM ISTఏపీ బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూడు లక్షల 32 వేల 205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ని రూపొందించారు. ఇద్నులో రెవిన్యూ లోటుగా 22 వేల కోట్లను చూపించారు. మూలధనం వ్యయం లోటుగా 53,915 కోట్ల రూపాయలు, కేంద్ర పన్నుల వాటాగా 64,363 కోట్లు, పన్నేతర ఆదాయం కింద 11,473 కోట్లు, పన్ను ఆదాయం కింద ఒక లక్షా 25 వేల 845 కోట్ల రూపాయలు, కేటాయింపులు చేశారు. అయితే బడ్జెట్ లో ఆదాయానికి ఖర్చులకు మధ్య లోటు ఉంది. ఆ లోటు 75,868 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. దాంతో అప్పులు చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
ఆర్థిక మంత్రి మాటల్లో :
అయితే దీని మీద ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లెలెఓ మాట్లాడుతూ గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పుల వల్లనే ఇంతటి భారాలు పెరిగాయని అన్నారు. దాంతో ఆదాయం ఎంత వచ్చినా అప్పులు తీర్చేందుకు వాటికి వడ్డీలు కట్టేందుకు సరిపోతోంది అని చెప్పారు. అయితే వైసీపీ హయాంలో అధిక వడ్డీలకు రుణాలను తెచ్చారని, అలా వివిధ సంస్థల నుంచి తెచ్చిన అప్పులతో వడ్డీలతో ఏపీ ఆర్ధికంగా ఇబ్బందులో పడిందని అన్నారు.
వడ్డీల భారం తగ్గింపు కోసం :
దాంతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్న వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. అలా 12.3 శాతంగా ఉన్న వడ్డీని 9 శాతానికి తగ్గించేలా ఆయా ఆర్థిక సంస్థలను ఒప్పించామని పయ్యావుల తెలిపారు. ఆ విధంగా అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల్లో ఇప్పటి వరకు రూ. 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. ఈ తరహా సంప్రదింపుల ఫలితంగా ఏడాదికి రూ. 327 కోట్ల మేర ఆదా అయిందని వివరించారు. అలాగే మరో రూ. 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించాలని సంప్రదింపులు జరుపుతున్నామని ఆర్హ్దిక మంత్రి తెలిపారు. ఈ సంప్రదింపులు ఫలిస్తే ఏడాదికి రూ. 1658 కోట్లు ఆదా అవుతుందని అంచనాగా ఉంది అని అన్నారు.
వారసత్వంగా వచ్చింది :
ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితులను బేరీజు వేసుకుంటే కనుక ఇది మెరుగైన బడ్జెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్టం ఇంకా కోలుకోవాలంటే మరి కొంత సమయం పడుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన వివరిస్తూ ఆదాయం తక్కువగా ఉందని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇదంతా గత వారసత్వంగా వచ్చినదే అని ఆయన అన్నరు అయితే తాము కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆర్థిక ఒడిదుడుకులు అన్నీ నిర్వహించుకుని వస్తున్నామని చెప్పారు.
అమరావతి ఒక రూపునకు :
అయితే మరో రెండు మూడేళ్ళలో అమరావతి రాజధాని ఒక రూపునకు వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అది కనుక జరిగితే ఏపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. ప్రస్తుతం అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. అలాగే పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిన్ పెరిగింది అన్నారు. ఇన్నర్ రింగ్ ఔటర్ రింగ్ వల్ల ఇంకా యాక్సిస్ పెరుగుతుందని అన్నారు. మొత్తానికి ఏపీకి ఖర్చులు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
