Begin typing your search above and press return to search.

టీడీపీ కూటమి ప్రచారానికి మెగాస్టార్ సిద్ధం ?

అందులోనూ ఈసారి ఎన్నికలు టీడీపీకే కాదు జనసేనకూ లైఫ్ అండ్ డెత్ గా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   22 April 2024 2:45 AM GMT
టీడీపీ కూటమి ప్రచారానికి మెగాస్టార్ సిద్ధం ?
X

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ గా తాను యాక్టివ్ గా లేను అని ఇటీవలనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరూ దూరంగా ఉండలేరు. చిరంజీవి కూడా అంతే అనుకోవాలి. పైగా ఆయన సొంత తమ్ముడు పార్టీ పెట్టి ఏపీలో చురుకైన పాత్ర పోషిస్తున్న వేళ మెగాస్టార్ న్యూట్రల్ గా ఎలా ఉండగలుగుతారు. అందులోనూ ఈసారి ఎన్నికలు టీడీపీకే కాదు జనసేనకూ లైఫ్ అండ్ డెత్ గా ఉన్నాయి.

ఇప్పటికే టీడీపీ బీజేపీ జనసేనతో కూటమి కట్టింది.కాంగ్రెస్ తో కూడా అవగాహన ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో వామపక్షాలు కూడా టీడీపీ విషయంలో స్మూత్ గానే ఉంటున్నారు. అంటే టోటల్ గా ఏపీలో పొలిటికల్ పిక్చర్ యాంటీ వైసీపీ గానే ఉంది. అలాంటి నేపధ్యంలో ఇంకా మరింత బలం కోరుకున్నారో లేక సినీ గ్లామర్ కోసం తపిస్తున్నారో తెలియదు కానీ మెగాస్టార్ ని సైతం ముగ్గులోకి దింపాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సీఎం రమేష్ వెళ్లడం అంటే ఏదో జస్ట్ ఆయనకు అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా మద్దతు కోసమని అనుకోవడానికి అసలు వీలు లేదు. ఆయన టీడీపీలో పుట్టి పెరిగిన నేత. పన్నెండేళ్ళ ఆయన రాజ్యసభ పదవి కాలం అంతా చంద్రబాబు చలవే. ఇక బీజేపీలో చేరిన రమేష్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కడం వెనక కూడా టీడీపీ అధినాయకత్వం ఫుల్ సపోర్ట్ ఉందని అంటారు.

అటువంటి సీఎం రమేష్ మెగాసీస్సులు తీసుకున్నారు అంటే అది ఆయన ఒక్కరికే కాదు కూటమి మొత్తానికే అని అంటున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది. మెగాస్టార్ చిరంజీవిని కూటమి తరఫున ప్రచారం చేయించుకునే ఆలోచన అయితే ఉంది అని అంటున్నారు. చిరంజీవికి పెద్ద మనిషిగా పేరుంది. అలాగే ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు.

దాంతో కూటమికి ఆయన ప్రచారం వల్ల లాభమే ఉంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా అయితే చిరంజీవి తనకెందుకు రాజకీయాలు అని అనుకున్నారు కానీ ఏపీలో హోరా హోరీ పోరు సాగుతోంది. దాంతో ఈ కీలక సమయంలో టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి చూస్తే అన్ని శక్తులనూ బయటకు తీస్తోంది. ఈసారి కనుక టీడీపీ అధికారంలోకి రాకపోయినా లేక వైసీపీ గెలిచినా కూడా ఇబ్బందే అని రాజకీయంగా వినిపిస్తున్న విశ్లేషణ.

దాంతో పాటుగా జనసేనకు కూడా ఈసారి ఎన్నికలు కీలకం అని అంటున్నారు. ఆ పార్టీ ఎన్నో కొన్ని సీట్లు గెలిచి ఈ తడవ అసెంబ్లీలో అడుగుపెడితేనే మనుగడ ఉంటుంది. దాంతో పాటు బీజేపీ కూడా మెగాస్టార్ పట్ల సానుకూల వైఖరిని కనబరుస్తోంది. గతలో అల్లూరి 125వ జయంతి వేడుకలు భీమవరంలో జరిగితే ప్రత్యేకంగా మెగాస్టార్ ని కేంద్ర ప్రభుత్వం పిలిచింది. ప్రధాని మోడీతో ఆనాడు వేదికను చిరంజీవి పంచుకున్నారు.

ఆ విధంగా చూసుకుంటే కనుక చిరంజీవిని తిరిగి రాజకీయం దిశగా అంతా కలసి నడిపిస్తారు అని అంటున్నారు. దానికి సంబంధించి తెర వెనక కార్యాచరణ సిద్ధం అవుతోంది అంటున్నారు. ఏపీలో కూటమి ప్రచారాన్ని చంద్రబాబు పవన్ భుజాల మీద వేసుకున్నారు. ఇక కేంద్ర మంత్రులు మోడీ అమిత్ షాలు ఏపీ ప్రచారానికి వస్తారు అని అంటున్నారు.

వారు వచ్చిన ఎక్కువ సేపు జాతీయ అంశాలనే ప్రస్తావిస్తారు అని అంటున్నారు. దేశంలో విషయాలు ప్రసావించినా ఏపీకి సంబంధించి జనాలను అట్రాక్ట్ చేసేలా మాట్లాడే వారు కావాలి. అంతే కాదు కూటమిని అనుకూలంగా వేవ్ అయితే క్రియేట్ చేయడం అన్నది రానున్న రోజుల్లో జరగాల్సి ఉంది.

మే మొదటి వారం గడిస్తే కనుక ఇక ఓటర్లు ఒక డెసిషన్ ని తీసుకుంటారు. అపుడు వేవ్ అన్నది క్రియేట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల నామినేషన్ల పర్వం తరువాత ఒక వారం పాటు మెగాస్టార్ కనుక ప్రచారం చేస్తే కూటమి మొత్తానికి అది రాజకీయ లాభంగా మారుతుందని అంటున్నారు. తొందరలొనే దీని మీద మెగా క్యాంప్ నుంచి సంచలన ప్రకటన వస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది.